కొత్తోళ్లతో కామెడీ చేస్తున్న తరుణ్!!

Update: 2017-08-28 17:30 GMT
పెళ్లి చూపులు మూవీతో దర్శకుడు తరుణ్ భాస్కర్ సాధించిన సక్సెస్ చిన్నదేమీ కాదు. చిన్న సినిమాలకు ఇది ట్రెండ్ సెట్టర్ అనాల్సిందే. ఇప్పుడీ దర్శకుడు తన కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. నిజానికి పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత స్టార్స్ నుంచి కూడా తరుణ్ భాస్కర్ కు పిలుపులు వచ్చాయి. తలుచుకుంటే పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ తో ఓ సినిమా చేయడం చాలా ఈజీ.

అయినా సరే.. తన స్టైల్ కే కట్టుబడ్డాడు తరుణ్ భాస్కర్. తన రెండో సినిమా విషయంలో కూడా అంతా తన స్క్రిప్ట్ ప్రకారమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న ఈ దర్శకుడు.. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసేసుకున్నానని చెబుతున్నాడు. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రాన్ని అంతా కొత్త వారితో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట తరుణ్ భాస్కర్. "నా సినిమా పూర్తి స్థాయిలో బబ్లీ కామెడీ మూవీ. ఇలాంటి కథ రాసేందుకు నా స్నేహితులే స్ఫూర్తి. మనం అందరం కుటుంబాలను ప్రేమిస్తాం. అయితే.. మన జీవితంలో స్నేహితులకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి కూడా ఫ్రెండ్స్ కు చెబుతాం. ఆ ఎమోషనే.. నా సినిమా కథకు ఇన్ స్పిరేషన్" అని చెప్పిన తరుణ్ భాస్కర్.. త్వరలో షూట్ స్టార్ట్ చేస్తామని అంటున్నాడు.

ఈ దర్శకుడు ఇచ్చిన క్యాస్టింగ్ కాల్ కు 1100కు పైగా ప్రొఫైల్స్ వచ్చాయట. ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదని.. అయితే అక్టోబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభించి.. కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేస్తామని చెబుతున్నాడు తరుణ్ భాస్కర్. స్టార్స్ నుంచి ఆఫర్స్ ను పక్కన పెట్టి కొత్తోళ్లతో ఫ్రెండ్ షిప్ పై సినిమా చేస్తున్నాడంటే.. టాలీవుడ్ లో ఓ హ్యాపీడేస్.. బాలీవుడ్ లో దిల్ చాహ్తా రేంజ్ లో ఉంటుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.



Tags:    

Similar News