పెళ్లి చూపులు సినిమా ఒక రకంగా టాలీవుడ్ లో పాత్ బ్రేకింగ్ చిత్రం. సినిమా లో కంటెంట్ ఉంటే చాలు హీరో హీరోయిన్లు కొత్తవాళ్ళైనా పర్లేదు మేము చూస్తాం అని ప్రేక్షకులు నిరూపించగా, బడ్జెట్ తక్కువైనా పర్వాలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే సత్తా తన వద్ద ఉంది అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రూవ్ చేశాడు. మరి తరుణ్ తర్వాత సినిమా ఏంటి?
ఈ ప్రశ్న ఇప్పుడు అందరూ తెలుగు ప్రేక్షకుల మనసులో ఎక్కడో ఒక చోట ఉండనే ఉంది. కానీ తరుణ్ మాత్రం ఈ విషయమై నోరు విప్పటం లేదు. ఎప్పుడో గతేడాది వార్త వచ్చింది పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ మళ్ళీ కొత్త వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ మెయిన్ థీమ్ గా మరో సినిమా చేయబోతున్నాడు అని. నిజానికి ''ఈ నగరానికి ఏమైంది?'' అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం మొదలు అవ్వలేదు. ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి మరి కాస్త సమయం పడుతుంది అంటూ యూనిట్ సభ్యులు చెప్తూన్నారు. రుమర్ల ప్రకారం అయితే క్వాలిటీ ఔట్పుట్ కోసం కొన్ని సీన్లను రీ షూట్ చేస్తున్నారు అని, ఆల్రెడీ అయిపోయిన సీన్లను కూడా రీ ఎడిట్ చేస్తున్నారని టాక్.
తరుణ్ పెళ్లి చూపుల విషయం లో కూడా ఇలానే చెప్పాడు. ఎప్పుడో రావాల్సిన చిత్రం ఇంకెప్పుడో వచ్చింది. అయినా ఏ మాత్రం హైప్ కానీ అంచనాలు లేకుండానే మన ముందుకు వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో తెల్సిందే. అయితే రెండో సినిమా కూడా ఇలా లేటైతే ఎలా? 2016 జూలైలో పెళ్ళిచూపులు సినిమాల రిలీజైన సంగతి తెలిసిందే. చూస్తుంటే ఉత్తిపుణ్యానిని రెండు సంవత్సరాలు గడిచిపోయినట్లు లేదూ?