`పెళ్లి చూపులు` సినిమాతో మైండ్ బ్లోయింగ్ హిట్ కొట్టాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా రిలీజ్ కి .. ప్రచారానికి సాయం చేసింది సురేష్ ప్రొడక్షన్స్. డి.సురేష్ బాబు దగ్గరుండి మరీ ప్రమోట్ చేయడమే గాక రిలీజ్ కి అన్నిరకాలుగా సాయం చేశారు. ఆ క్రమంలోనే సురేష్ ప్రొడక్షన్స్ లో వరుసగా సినిమాలకు సంతకం చేశాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ట్యాలెంట్ ఉన్న యంగ్ గయ్స్ ని లాక్ చేయడంలో డి.సురేష్ బాబు తర్వాతనే. అలా ఆ బ్యానర్ లోనే `ఈ నగరానికి ఏమైంది?` చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే `పెళ్లి చూపులు` కమర్షియల్ బ్లాక్ బస్టర్. జాతీయ అవార్డులు గెలుచుకుంది. కానీ `ఈ నగరానికి ఏమైంది?` అన్నిరకాలుగానూ ఫెయిలవ్వడంతో ఆ విషయం రాసిన క్రిటిక్స్ పైనా తరుణ్ భాస్కర్ గుర్రుమన్నాడు.
అదంతా పాత కథ అనుకుంటే.. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్ సమర్పిస్తున్న మరో చిన్న చిత్రం `ఫలక్ నుమా దాస్`లో తరుణ్ భాస్కర్ నటుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అతడు పోలీస్ అధికారిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన టీజర్.. ట్రైలర్లకు అద్భుత స్పందన వచ్చింది. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫలక్ నుమా దాస్ ప్రెస్ మీట్ లో తరుణ్ భాస్కర్ ఇంప్రెస్సివ్ స్పీచ్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్స్ పై ప్రశంసల వర్షం కురిపించడమే కాదు ఆ సంస్థపైనా.. నిర్మాత డి.సురేష్ బాబు పైనా తన ప్రేమాభిమానాల్ని వ్యక్తం చేశాడు. సురేష్ ప్రొడక్షన్స్ లాక్ చేస్తుందని భయపెట్టారు. నేను లాక్ అయిపోవడానికి సిద్ధం అని ఎమోషన్ అవ్వడం చర్చకొచ్చింది. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ``ఫలక్ నుమా దాస్ ని ప్రోత్సహించిన సురేష్ ప్రొడక్షన్స్ కి థాంక్స్. ఎందరో మేకర్స్ ని.. దర్శకుల్ని తీర్చిదిద్దిన గొప్ప సంస్థ సురేష్ ప్రొడక్షన్స్.. ఎందరినీ గొప్పవారిని చేశారు. ఆయన కింగ్ మేకర్. చాలా గర్వంగా ఉంది. చాలా మంది చెప్పేవాళ్లు .. సురేష్ ప్రొడక్షన్స్ కి వెళితే లాక్ అయిపోతావు అనేవాళ్లు. వాళ్లందరికీ చెబుతున్నా.. నేను లాకైపోతా.. ఇక్కడ సినిమానే జీవితం`` అంటూ కాస్తంత రాజ్ తరుణ్ ఎమోషనల్ స్పీచ్ తో అదరగొట్టారు.
సినిమా డీటెయిల్స్ చెబుతూ..``విశ్వక్ సేన్ తొలుత ఓ లఘు చిత్రం చేశాడు. పూర్తి సినిమా తీయగలడా? అనుకుంటే ప్రాక్టికల్ గా చాలా బాగా తీశాడు. సెట్స్ కెళ్లాక ఎంతో బాగా పని చేశాడు. సమాజంలో మన కథలు మనం తెరపై చూసినప్పుడు ఫీల్ రావాలి. మన బంధుత్వాలు గుర్తుకు రావాలి. ఎవరినో కొట్టడం తిట్టడం టైపు కాదు.. మన ఇంట్లో జరిగే విషయాలు కనిపిస్తాయి. అమ్మా నాన్న సిస్టర్ అనుబంధాల్ని గుర్తు చేసే సినిమా ఎప్పుడూ గుండెల్ని తాకుతుంది. మలయాళంలో ఈ తరహా వస్తాయి. తెలుగులో తక్కువ వస్తాయి. విశ్వక్ ప్రయత్నం నచ్చింది. అతడు ఈ చిత్రంలో నటిస్తూ దర్శకత్వం వహించాడు. మలయాళ చిత్రం `అంగమళై డైరీస్` రీమేక్ గా ఈ సినిమాని తీశాడు. రీమేక్ ను ఇలానే తీయాలి అనేలా తీశాడు. యాజిటీజ్ డైలాగ్ టు డైలాగ్ సినిమాని చేయలేదు. రూరల్ సిటీ బ్యాక్ డ్రాప్ లో మాస్ మసాలా కమర్షియల్ సినిమాగా చేశారు. ఫలక్ నుమాలో జరిగితే ఎలా ఉంటుంది? అన్నది అద్భుతంగా తీశారు. పాత్రల్ని.. ఎమోషన్స్ ని మార్చి థాట్ ప్రొవోకింగ్ గా ప్రయత్నించారు. వందశాతం ఒరిజినాలిటీ కనిపిస్తుంది. మీరు మీ రిలేషన్ షిప్స్ ని తెరపై చూస్తారు. చివరి 14 నిమిషాలు అయితే ఆ ఏరియాలోకి వెళ్లి... వాళ్లతోనే బోనాలు ఆడి.. వాళ్లతోనే తాగి.. డ్యాన్సులాడినట్టు.. ఇంట్లో దూరి పూజలు చేసినట్టు అనిపిస్తుంది. అలాంటివి సినిమాతోనే చేయగలం. విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ సినిమా చేశారు`` అంటూ పొగిడేశారు. ఇక ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ నటుడిగానూ నిరూపించుకుంటాడని డి.సురేష్ బాబు కితాబిచ్చారు. తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ ఓ సినిమాని నిర్మిస్తారని అప్పట్లో ప్రచారమైంది. ఇందులో అనసూయ కథానాయికగా నటిస్తుందని తెలిసింది. తదుపరి వివరం తెలియాల్సి ఉందింకా. మరోవైపు సురేష్ ప్రొడక్షన్స్ లో దర్శకుడిగా సినిమా తీసేందుకు తరుణ్ భాస్కర్ కథలు రాస్తున్నారట.