ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తల పై దాడుల నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ వీడియో వైరల్ గా మారింది.. జగపతి బాబు హీరోగా నటించిన ‘ధమ్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు చైతన్యకృష్ణ. ఆ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయారు. కానీ ఎన్నికల వేళ మాత్రం టీడీపీ తరుఫున యాక్టివ్ గా పాల్గొంటారు చైతన్యకృష్ణ.
అయితే తాజాగా తెలుగు తమ్ముళ్ల మీద దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీకి వార్నింగ్ ఇస్తూ చైతన్య వీడియో పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలుగు తమ్ముళ్లు ఫుల్ ఖుషీ అయ్యారట.. చైతన్యకృష్ణ లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సమయంలో టీడీపీకి మద్దతుగా నిలిస్తే సమరోత్సాహం వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారట.. అయితే టీడీపీ కుదేలైన ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదన్న చర్చ తెలుగుతమ్ముళ్లలో సాగుతోందట.
గత తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా తన సోదరి పోటీచేసినా జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఒక పత్రికా ప్రకటన మాత్రమే విడుదల చేసి మద్దతిచ్చారు. ఓటేయాలని కోరారు. ఇక మొన్నటి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. టీడీపీ తరుఫున ఎలాంటి ప్రచారం, ప్రకటన విడుదల చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం నేపథ్యంలోనే ఎన్టీఆర్ దూరంగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది.
చైతన్యక్రిష్ణ లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక్క వీడియో విడుదల చేస్తే బాగుంటుందన్న చర్చ టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోందట.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో హైదరాబాద్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. పార్టీ సంక్షోభం ఉన్న ఈ సమయంలో తెలుగు తమ్ముళ్లూ జూనియర్ వైపు ఆశగా చూస్తున్నారు. కానీ చంద్రబాబు పూర్తిగా దూరం పెట్టిన నేపథ్యంలో ఎన్టీఆర్ వస్తాడా? రారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట..