టీం ఇండియాకు సూపర్‌ స్టార్‌ థ్యాంక్స్‌

Update: 2019-06-13 12:19 GMT
ప్రస్తుతం ఐసీసీ వరల్డ్‌ కప్‌ కోసం ఇంగ్లాండ్‌ లో పర్యటిస్తున్న టీ ఇండియా క్రికెట్‌ జట్టు ఆట విడుపుగా నిన్న సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'భారత్‌' చిత్రాన్ని వీక్షించడం జరిగింది. బాలీవుడ్‌ 'భారత్‌' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ ను దక్కించుకుంది. దాంతో పాటు వంద కోట్ల క్లబ్‌ లో చేరింది. సినిమాకు మంచి టాక్‌ వస్తున్న ఈ సమయంలో టీం ఇండియా సభ్యులు భారత్‌ సినిమా చూడటం ఆ సినిమాకు మరింత బూస్ట్‌ ను ఇచ్చినట్లయ్యింది.

భారత్‌ టీంతో 'భారత్‌' చిత్రాన్ని చూశాను అంటూ టీం ఇండియా ఆటగాడు కేదార్‌ జాదవ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కేదార్‌ జాదవ్‌ తో పాటు సినిమా చూసిన ఆటగాళ్లలో ఎంఎస్‌ ధోనీ.. హార్ధిక్‌ పాండ్య.. కేఎల్‌ రాహుల్‌.. శిఖర్‌ దావన్‌.. అతుల్‌ ఉన్నారు. టీం ఇండియా ఆటగాళ్లు తన సినిమా చూడటం పట్ల సల్మాన్‌ ఖాన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. భారత్‌ సినిమాను చూసిన టీం మెంబర్స్‌ కు సోషల్‌ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు.

సల్మాన్‌ ఖాన్‌ ట్విట్టర్‌ లో... భారత్‌ సినిమాను చూసినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ఆడబోయే తర్వాత మ్యాచ్‌ లకు మీకు ఆల్‌ ది బెస్ట్‌. మొత్తం భారత దేశం మీ వెంటే ఉంది. బాగా ఆడాలంటూ ప్రపంచకప్‌ మ్యాచ్‌ ల్లో టీం ఇండియా గెలవాలంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ను పోస్ట్‌ చేస్తూ భారత విజయంను సల్మాన్‌ అభిలాషించాడు.

భారత్‌ చిత్రంలో సల్మాన్‌ కు జోడీగా కత్రీనా కైఫ్‌ నటించిన విషయం తెల్సిందే. అలీ అబ్బాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రంజాన్‌ పండుగ సందర్బంగా జూన్‌ 5వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ గా దిశా పటాని నటించింది. ఇక ఈ చిత్రంలో సల్మాన్‌ అయిదు విభిన్నమైన గెటప్స్‌ లో కనిపించడం విశేషం.
Tags:    

Similar News