'నీది నాది ఒకే కథ' అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు వేణు ఊడుగుల. మొదటి సినిమానే మంచి విజయం సాధించి విమర్శకుల నుండి ప్రశంసలు అందించింది. ఇప్పుడు వేణు రెండో సినిమాగా విరాటపర్వం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హీరో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే మహిళా దినోత్సవం సందర్బంగా విరాటపర్వం చిత్రబృందం రానా వాయిస్ ఓవర్ తో ఓ మహిళలకు స్ఫూర్తిదాయకమైన శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమా 1990 కాలంనాటి నక్సలైట్ల జీవితాల ఆధారంగా పీరియాడిక్ సోషల్ మూవీగా రూపొందుతుంది.
'చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది. ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమే అని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది. మహా సంక్షోభమే ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని నమ్మిన విప్లవం తనది. అడవి బాటపట్టిన అనేకమంది వీరుల తల్లులకు వీళ్ళు ప్రతిరూపాలు. వీళ్ల మార్గం అనన్యం.. అసామాన్యం. రెడ్ సెల్యూట్ టు ఆల్ ది గ్లోరియస్ విమెన్" అంటూ మహిళలకు లాల్ సలాం చెప్పారు మేకర్స్. అలాగే ఈ మోషన్ పోస్టర్ లోనే విరాటపర్వం విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ 30న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ప్రియమణి, నివేత పేతురాజ్, నందిత దాస్ కీలకపాత్రలలో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.Full View
'చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది. ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమే అని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది. మహా సంక్షోభమే ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని నమ్మిన విప్లవం తనది. అడవి బాటపట్టిన అనేకమంది వీరుల తల్లులకు వీళ్ళు ప్రతిరూపాలు. వీళ్ల మార్గం అనన్యం.. అసామాన్యం. రెడ్ సెల్యూట్ టు ఆల్ ది గ్లోరియస్ విమెన్" అంటూ మహిళలకు లాల్ సలాం చెప్పారు మేకర్స్. అలాగే ఈ మోషన్ పోస్టర్ లోనే విరాటపర్వం విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ 30న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ప్రియమణి, నివేత పేతురాజ్, నందిత దాస్ కీలకపాత్రలలో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.