కప్నడ స్టార్ యష్ నటించిన 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి కన్నడ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాలుగా చరిత్ర సృష్టించాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా కన్నడ సినిమా ఇండస్ట్రీ పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోయింది. ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'కేజీఎఫ్' ఈ తరహా సినిమాలకు కన్నడ నాట ప్రానం పోసింది.
దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇదే తరహాలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ యాక్షన్ డ్రామాలు భారీ స్థాయిలో తెరపైకి రావడం మొదలైంది. ఈ నేపథ్యంలో ముందు వరుసలో వస్తున్న మూవీ 'కబ్జ'. రియల్ స్టార్ గా కన్నడ నాట పేరు తెచ్చుకున్న ఉపేంద్ర ఇందులో హీరోగా నటించాడు. శ్రియ హీరోయిన్ఆ. ర్. చంద్రు దర్శకత్వం వహించిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో కన్నడతో కలిసి ఏడు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఎంటిబి నాగరాజ్ సమర్పణలో సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఆర్. చంద్రశేఖర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
కిచ్చా సుదీప్ కీలక అతిథి పాత్రలో నటించిన ఈ మూవీకి కేజీఎఫ్ ఫేమ్ రవి బాస్రూర్ సంగీతం అందించాడు. శనివారం ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. 1942లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్టుగా తెలుస్తోంది.
రైజ్ ఆఫ్ ది ఇండియన్ గ్యాంగ్ స్టర్ రియల్ స్టోరీగా తెరకెక్కించన ఈ మూవీ టీజర్ లోని ప్రతీ సన్నివేశం.. యష్, ప్రశాంత్ నీల్ ల 'కేజీఎఫ్'ని గుర్తు చేస్తోంది. చరిత్రలో మిగిలి పోయిన ఓ గ్యాంగ్ స్టర్ స్టోరీని చెబుతున్నాం అంటూ టీజర్ లో దర్శకుడు వెల్లడించిన తీరు ఆకట్టుకుంటోంది.
అయితే ప్రతీ సీన్, ప్రతీ ఫ్రేమ్ కేజీఎఫ్ కు మరో వెర్షన్ ల కనిపించడం గమనార్హం. అయితే సన్నివేశాలని చూపించిన తీరుని చూస్తుంటే అదే ఫీల్ కలుగుతున్నా పవర్ ఫుల్ క్యారెక్టర్లతో పూర్తిగా దర్శకుడు చంద్రు కొత్త కథని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. టీజర్ లోని విజువల్స్ చూస్తుంటే లార్జర్ దెన్ లైఫ్ మూవీగా 'కబ్జ'ని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. 'కేజీఎఫ్'కు ప్రాణంగా నిలిచిని రవి బాస్రూర్ నేపథ్య సంగీతం 'కబ్జ'కు కూడా అదే ఫీల్ ని కలిగిస్తూ ప్రధాన హైలైట్ గా నిలుస్తోంది.
ఇక టీజర్ లో బలమైన ఘట్టాలని చూపించినా డైలాగ్స్ మాత్రం వినిపించకుండా కేవలం నేపథ్య సంగీతంతోనే కట్టిపడేసే ప్రయత్నం చేశారు. ఏజే శెట్టి అందించిన విజువల్స్, రవి బాస్రూర్ నేపథ్య సంగీతం, ఆర్. చంద్ర టేకింగ్, ఆర్. చంద్ర శేఖర్ మేకింగ్ 'కబ్జ' మరో లార్జర్ దెన్ లైఫ్ సినిమా అని స్పష్టం చేస్తున్నాయి. సినిమాని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు మరాఠీ, ఒరియా భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View