ఒక్కో సారి సినిమా మొదలు పెడితే అది షూటింగ్ ఎండ్ అయ్యే వరకు రిలీజ్ అవుతుందా లేదా చెప్పడం కష్టం. ప్రస్తుత రోజుల్లో చాలా వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లోనే సినిమాలు ఎండ్ అవుతున్నాయి. అయితే ఎదో చిన్న సినిమాలు తెరకెక్కించే దర్శకులకు అలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నారు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ సీనియర్ డైరెక్టర్ తేజ ప్రాజెక్ట్ లు కూడా అలానే ఎండ్ అవుతున్నాయి.
గత ఏడాది నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తేజ బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత వరుసగా ఆఫర్స్ వచ్చినట్లు న్యూస్ లు వచ్చాయి. తేజ కూడా ఫుల్ స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నాడు. ముందుగా వెంకటేష్ - నారా రోహిత్ తో ఒక మల్టీస్టారర్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా ఎవరికి తెలియకుండానే క్లోజ్ అయ్యింది. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ తో రానున్నాడు అని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఆ సినిమా యూనిట్ తో కొన్ని నెలల వరకు ట్రావెల్ చేసిన తేజ సడన్ గా బయటకు వచ్చేశాడు.
ఇక ఆ తరువాత రానా తో కలవనున్నట్లు మరో వార్త వైరల్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల సెట్స్ పైకి రాకుండానే క్లోజ్ అయ్యింది. ఇక ఫైనల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా ఒకే చేశాడు. అనిల్ సుంకర ఆ సినిమాను నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా సెట్ అయ్యింది. మరి ఈ ప్రాజెక్ట్ అయినా పట్టాలెక్కుతుందా లేక తేజ మధ్యలోనే వదిలేసి ఇంకోటి అంటాడా చూడాలి.