ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలతో వరుస హిట్స్ కొట్టిన దర్శకుడు తేజ.. ఆ తర్వాత ఫ్లాపులతో తెరమరుగయ్యారు. కానీ మళ్లీ ‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమాతో హిట్ కొట్టి ఫాంలోకి వచ్చారు. ఆ సినిమా తర్వాత ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్’ బయోపిక్ చేసే అవకాశం తేజకు దక్కింది. కానీ ఆ సినిమా తనతో కాదు అని వదిలేశాడు. ఇక ఆ తర్వాత టాప్ హీరో వెంకటేశ్ తో కూడా సినిమా చేస్తానని ప్రకటించినా అదీ పట్టాలెక్కలేదు..
తాజాగా తేజ తన కొత్త సినిమాను ఓకే చేశాడు.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తన కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టబోతున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఈ సినిమాను తీయనున్నారు. ఈ సోమవారమే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఇక తేజ దర్శకత్వంలోనే ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్ అగర్వాల్... ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. మొత్తానికి రెండు సినిమాలు ఓకే అనుకొని రద్దు చేసుకున్న తేజ తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేస్తుండడం విశేషం.