తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ లుగా మిగిలిపోయే చిత్రాలెన్నో కళాతపస్వి కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చాయి. వాటిలో ప్రేక్షకులు ఎన్నాళ్లయినా గుర్తుంచుకునే సినిమా స్వాతిముత్యం. ఇందులో అమాయకుడిగా కమల్ హాసన్ నటన ఒకసారి చూసినవారెవరూ మర్చిపోలేరు.
ఇన్నేళ్ల తరవాత ఈ మూవీకి సీక్వెల్ తీయడానికి టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఆలోచిస్తున్నాడు. ఆమధ్య వరస ఫ్లాపులతో సతమతమైన డైరెక్టర్ తేజ రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఎన్టీఆర్ జీవిత కథతో ఆయన తనయుడు బాలకృష్ణ తీయాలనుకున్న బయోపిక్ కు ముందు తేజనే దర్శకుడిగా ఎంచుకున్నారు. సినిమా స్టార్టయ్యాక తేజ ఈ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. ఓ డిఫరెంట్ సినిమా తీయాలన్న ఆలోచనతో స్వాతిముత్యంకు సీక్వెల్ తీయడానికి స్టోరీ రెడీ చేసుకుంటున్నాడు. ఇందులో లీడ్ రోల్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను తీసుకోవాలని ఆలోలిచిస్తున్నాడనేది తేజ సన్నిహితుల మాట.
స్వాతిముత్యం సినిమా కలెక్షన్లతో ఎన్నో అవార్డులు దక్కించుకుంది. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. స్వాతిముత్యం స్థాయిలో మెప్పించడం అంత సులువేం కాదనే ఆ సినిమా పేరు పెట్టడానికే డైరెక్టర్లు జంకుతారు. కానీ తేజ అదే స్టోరీతో తీయడానికి రెడీ అవడం టాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓకే అయినా నటుడిగా అంత మెప్పించిందీ లేదు. ఈ టైంలో స్వాతిముత్యం తీయడమంటే ఆషామాషీ కాదు. తేజా.. ఈ విషయం కాస్త ఆలోచిస్తే బెటర్.