యువ ట్యాలెంట్ ప్రశాంత్ వర్మ ప్రయోగాల గురించి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ వైవిధ్యమైన కథల్ని కాన్సెప్టుల్ని ఎంచుకుంటూ యూనిక్ స్టైల్లో తనని తాను ఆవిష్కరించుకుంటున్నాడు. అతడు తెరకెక్కించిన అ!.. కల్కి దేనికదే విలక్షణమైనవని ప్రశంసలు అందుకున్నాడు. జాంబీల నేపథ్యంలో తొలి తెలుగు సినిమా తీసిన ఘనత తనకే దక్కింది.
ఇప్పుడు అతడు హను-మాన్ అంటూ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఇది కేవలం ఒక సినిమా కాదు.. భారతీయ పురాణేతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో వరుస చిత్రాలను రూపొందిస్తున్నామని ముందే టైటిల్ ప్రకటన వేళ వెల్లడించారు. సూర్య పుత్రుడు తేజోవంతుడైన హను-మాన్ అనే ఫిక్షనల్ పాత్రకు తేజ సజ్జా ను ఎంపిక చేసుకుని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.
అంజనాద్రి ప్రపంచంలోకి ప్రయాణం `హను-మాన్` నుంచి హనుమంతు ను పరిచయం చేయగా ఆకట్టుకుంది. తేజ సజ్జా సూపర్ హీరో పాత్రలో మైమరిపిస్తాడని భరోసానిచ్చింది మోషన్ టీజర్. నిరవ్ రెడ్డి-చైతన్య నిరవ్ తదితరులు ఈ చిత్రంతో అసోసియేట్ అయ్యారు. 13 డిసెంబర్ సోమవారం ఉదయం 10.35 నిమిషాలకు అంజనాద్రి నుంచి మీనాక్షి ని కలవండి! అంటూ ప్రమోషన్ లో వేగం పెంచింది టీమ్. సముద్ర అలలపై ఎగిరెగిరిపడుతున్న మీనా(చేప)న్ని పోస్టర్ లో చూపించడం ఆసక్తిని కలిగిస్తోంది.