హమ్మయ్య తేజ మొదలుపెట్టాడు

Update: 2018-07-09 07:32 GMT
వెంకటేష్ బాలకృష్ణలతో వరుసగా సినిమాలు చేజారాక బాగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు తేజ ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టేశాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమయ్యింది. వివి వినాయక్ క్లాప్ తో  ఓపెనింగ్ షాట్ కానిచ్చేశారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ జానర్ బయటికి చెప్పనప్పటికీ యాక్షన్ నేపధ్యంలో ఉంటుందని టాక్. సాయి శ్రీనివాస్ గత ఏడాది జయ జానకి నాయక చేసాక సుమారు ఏడాది గ్యాప్ తర్వాత ఈ నెల 27న సాక్ష్యం విడుదల కానుంది. దీని మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆ మూవీపై ట్రైలర్ వచ్చాక  హైప్ పెరుగుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఇప్పటికే ఓ సినిమాలో నటిస్తున్న కాజల్ కి ఒకే హీరోతో  ఇది వరసగా రెండోది. తేజతో లాస్ట్ ఇయర్ చేసిన నేనే రాజు నేనే మంత్రి మంచి హిట్ గా పేరు తెచ్చుకుని అందులో రాధా పాత్ర వేసిన కాజల్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు వెంకటేష్ ఆటా నాదే వేటా నాదే ప్రాజెక్ట్స్ ని మిడిల్ డ్రాప్ కావడం తేజపై ఒత్తిడి పెంచేసింది. స్టార్ హీరోల సినిమాలు కాబట్టి అవి పోవడం చిన్న విషయం కాదు. ఇప్పుడు సాయి శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో తానేంటో ఋజువు చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ కసితోనే స్క్రిప్ట్ బలంగా రాసుకున్నాడని వినికిడి. యూత్ హీరోలను డీల్ చేయటంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న తేజ వల్లే ఉదయ్ కిరణ్-నితిన్ లాంటి హీరోలు బాగా స్థిరపడ్డారు. ఇప్పుడు సాయి శ్రీనివాస్ కు కూడా ఆలాంటి బ్రేక్ ఇస్తాడన్న అంచనాలో అభిమానులు ఉన్నారు. తన మొదటి సినిమా లక్ష్మి కళ్యాణం దర్శకుడిగా తేజ అంటే అభిమానం చూపించే కాజల్ ఇది తమ కాంబినేషన్ కు హ్యాట్రిక్ మూవీ అవుతుందన్న నమ్మకంతో ఉంది .
Tags:    

Similar News