ఎన్టీఆర్ కోసం తేజ టెక్నాలజీ సాయం

Update: 2018-01-03 06:19 GMT
హీరో బాలకృష్ణ వంద సినిమాల తర్వాత వేగం బాగా పెంచాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పైసా వసూల్ రిలీజైన నెలల వ్యవధిలోనే తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ డైరెక్టషన్ లో జైసింహా సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతి నాటికి థియేటర్లకు రానుంది. జైసింహాకు సంబంధించి తన పని మొత్తం పూర్తవడంతో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ పై దృష్టి పెట్టాడు.

నేనే రాజు - నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ డైరెక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ మూవీకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ చేస్తాడనేది ముందుగానే చెప్పేశారు. ఇక ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర ఎవరు చేయబోతున్నారు అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ పాత్రకు ఎలాంటి ఇమేజ్ లేని కొత్త నటిని తీసుకోవాలని హీరో బాలకృష్ణ - డైరెక్టర్ తేజ భావిస్తున్నారు. ఈ పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపుతూ వాళ్ల దగ్గరకు కుప్పలుతెప్పలుగా ఫొటోలు వచ్చి పడ్డాయట. వాటిలో నుంచి బసవతారకం పోలికలతో ఉన్నవారిని ఎంపిక చేసి ఆడిషన్ కు పిలవాలన్నది వారి ఆలోచనగా ఉందని తెలుస్తోంది.

వచ్చిన ఇన్ని అప్ల్లికేషన్లు - ఫొటోలను ఫిల్టర్ చేయడం తలకుమించిన భారంగా మారడంతో డైరెక్టర్ తేజ ఈపని కోసం కొత్త టెక్నాలజీ వాడుతున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ఫేస్ రిక్నగిషన్ అనే సాఫ్ట్ వేర్ ఉపయోగించబోతున్నారు. ఈ సాఫ్ట్ వేర్ ముఖం ఆకృతి.. కొలతలు.. కవళికలు అన్నీ ఎనలైజ్ చేసి ఎవరి ఫొటో అయితే బవసతారకం ముఖానికి ఈజీగా సరిపోలుతుందో డిటెక్ట్ చేసి చెబుతుంది. అలా సాఫ్ట్ వేర్ ఎంపిక చేసినవాళ్లనే ఆడిషన్ కు పిలిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. మొత్తానికి టెక్నాలజీ బాగానే వాడుతున్నాడన్న మాట.
Tags:    

Similar News