ఎన్టీఆర్ బయోపిక్ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బాలయ్య నటిస్తూ - నిర్మిస్తున్న ఎన్టీఆర్ సినిమా ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నాడు. తేజ తానే తప్పుకున్నాడా.. లేక తప్పించారా అనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. తేజ తప్పుకున్న విషయం మాత్రం మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎలా చూపించాలన్నదాని పై బాలయ్య - తేజ మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. తేజ కాకుండా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డీల్ చేయబోతున్నారు అనేది కూడా సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. తేజ తప్పుకోవడం అనూహ్య పరిణామమని అంటున్నారు.
ఎన్టీఆర్ సినిమా మార్చి 29వ తేదీ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. సినీ ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు అందరూ తరలివచ్చారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది అన్న టైంలో.. కీలకమైన డైరెక్టర్ తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం చర్చనీయాంశం అయ్యింది. బాలయ్య స్వయంగా దర్శకత్వం వహిస్తారని ఓ ప్రచారం జరుగుతుండగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా లేకపోలేదనే మరో వాదన కూడా ఉంది. ఈ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలాఉండగా...టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గురించి ``లక్ష్మీస్ ఎన్టీఆర్`` పేరుతో సినిమా తీయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానమని పేర్కొంటూ ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ వివరిస్తూ సినిమా ఉంటుందని ప్రకటించారు. కొద్దికాలం తర్వాత వైసీపీ నేత ఒకరు ప్రొడ్యూసర్ అని వెల్లడించారు. ఇంకేం...టీడీపీ నేతలు వర్మపై విరుచుకుపడ్డారు. అయితే ఆ సినిమా అనూమ్య రీతిలో వాయిదా పడింది. ఇప్పుడు బాలయ్య తీస్తున్న సినిమా సైతం ఇదే రీతిలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకోవడం గమనార్హం.