సే నో టు సోష‌ల్ అబ్యూస్....తేజ‌స్విని

Update: 2018-07-26 16:46 GMT
బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన తేజ‌స్విని మదివాడ‌పై నెటిజ‌న్లు అస‌భ్య ప‌ద‌జాలంతో ట్రోలింగ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆమెపై వాడిన భాష పై హీరో నాని  కూడా మండిప‌డ్డాడు. అస‌లు మ‌నుషులు ఇలాంటి భాష మాట్లాడ‌తారా అంటూ నెటిజ‌న్ల పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా సోష‌ల్ మీడియాలో త‌న‌పై వ‌స్తోన్న ట్రోలింగ్ పై తేజ‌స్విని స్పందించింది. త‌న‌పై ట్రోలింగ్ ఆపాల్సిందిగా చాలా ర‌కాలుగా చెప్పానని, అయినా విన‌డం లేద‌ని తేజూ వాపోయింది. త‌న‌కూ పేరెంట్స్ ఉన్నార‌ని......ఓ మ‌న‌సుంద‌ని ....అది బాధ‌ప‌డుతుంద‌ని చెప్పింది.  త‌న‌ను తిట్టే హ‌క్కు నెటిజ‌న్ల‌కు లేద‌ని మండిప‌డింది. త‌న‌ను అన‌డానికి వారెవ‌రంటూ నెటిజ‌న్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌న‌నే కాద‌ని, త‌న‌తోపాటు హౌస్ మేట్స్ దీప్తి - సున‌య‌న‌....అస‌లు మ‌హిళ‌ల‌ను ఎవ‌రినీ తిట్టే హ‌క్కు నెటిజ‌న్ల‌కు లేద‌ని మండిప‌డింది. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తేజూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

త‌న‌ను బూతులు తిట్టే హ‌క్కు త‌న స్నేహితుల‌కే లేద‌ని...అటువంటిది....ఎవ‌రు ప‌డితే వారు తిడితే తాను భ‌రించ‌న‌ని చెప్పింది. త‌ల్లిదండ్రులు....ఇంట్లో అబ్బాయిల‌కు అలా కామెంట్ చేయ‌ద్ద‌ని చెప్పాల‌ని....ఇలాంటి కామెంట్స్ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని అమ్మాయిల‌కు చెప్పాల‌ని కోరింది. మ‌న ఫీలింగ్స్ ను ఎక్స్ ప్రెస్ చేయ‌డానికి సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ఉంద‌ని.....ఎవ‌రి గురించైనా...న‌చ్చితే న‌చ్చింద‌ని,...లేదంటే లేద‌ని చెప్ప‌చ్చని....కోపాన్ని ఎక్స్ ప్రెస్ చేయ‌చ్చని చెప్పింది. కానీ, బూతులు తిట్టడం ఏమిట‌ని ప్ర‌శ్నించింది. `సే నో టు అబ్యూస్ ఆన్ సోష‌ల్ మీడియా` అని......మంచివాళ్లంద‌రూ ఈ త‌ర‌హా ప్ర‌చారం చేయాల‌ని కోరింది. కాగా, జాగ్ర‌త్త‌గా ఉండాలని కౌశ‌ల్ కు చెప్పిన‌ట్లు త‌న‌కు కూడా నాని చెప్పి ఉంటే బాగుండేద‌ని బాధ‌పడింది. నీ నోటికి అడ్డూ అదుపు లేదు అని నాని...అనేస‌రికి త‌న‌ను అంతా నెగెటివ్ గా తీసుకున్నార‌ని చెప్పింది. బాబు గోగినేని గారు క్యూట్ గా చీట్ చేస్తారని...హౌస్ లో చాలా స‌ర‌దాగా ఉంటామ‌ని చెప్పింది. 
Tags:    

Similar News