సామ్రాట్‌ తో ప్రేమ - పెళ్లిపై తేజస్వి అదేమాట

Update: 2018-08-29 06:49 GMT
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో హీరోయిన్‌ సమంతకు చెల్లి పాత్రలో నటించి రెండు మూడు సీన్స్‌ లో మెరిసిన తేజస్వి ఆ చిత్రం తర్వాత బిజీ అయ్యింది. వర్మ ఐస్‌ క్రీం చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన తేజస్వి స్టేజ్‌ షో - సినిమా వేడుకల్లో సందడి చేస్తూ హీరోయిన్‌ గా  - క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ను కొనసాగిస్తూ వస్తుంది. తేజస్వికి తెలుగు బిగ్‌ బాస్‌ రెండవ సీజన్‌ లో ఛాన్స్‌ దక్కింది. తేజస్వి బిగ్‌ బాస్‌ లో చాలా బలమైన కంటెస్టెంట్‌ అని అంతా అనుకున్నారు. కాని ఆమె చాలా త్వరగా ఇంట్లోంచి వెళ్లి పోయింది. ఇక బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్నన్ని రోజులు సామ్రాట్‌ తో చాలా సన్నిహితంగా మెలిగింది. సామ్రాట్‌ తో ఆమె వ్యవహారం పీక్స్‌ కు వెళ్లింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవడం ఖాయం అనుకున్నారు.

తేజస్వి ఎలిమినేట్‌ అయిన తర్వాత ఎక్కువ మంది ఆమెను సామ్రాట్‌ తో పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. హౌస్‌ లో ఉన్నన్ని రోజులు సామ్రాట్‌ తో చాలా లవ్లీగా గడిపిన తేజస్వి బయటకు వచ్చిన తర్వాత సామ్రాట్‌ కేవలం స్నేహితుడు మాత్రమే అని - అందరిలాగే తను అంటూ చెప్పుకొచ్చి అందరికి షాక్‌ ఇచ్చింది. తేజస్వి మొదట సామ్రాట్‌ తో ప్రేమ విషయాన్ని కొట్టి పారేస్తుందని - ఖచ్చితంగా ఇద్దరు వివాహం చేసుకుంటారు అని అనుకున్నారు. కాని తాజాగా మరోసారి కూడా తేజస్వి తాను సామ్రాట్‌ ను వివాహం చేసుకోబోవడం లేదు బాబోయ్‌ అంటూ మొత్తుకుంది.

తాజాగా తేజస్వి సోషల్‌ మీడియా ద్వారా నాకు జీవితంలో ఎదురైన పరిస్థితు కారణంగా కొందరిపై అధికంగా ప్రేమను చూపిస్తాను. ఆ ప్రేమను సామ్రాట్‌ పై చూపించడం జరిగింది. ఆ ప్రేమను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు సామ్రాట్‌ మంచి స్నేహితుడు మాత్రమే. మా ఇద్దరి మద్య ఉన్నది స్నేహంతో కూడిన ప్రేమ అంటూ తేజస్వి చెప్పుకొచ్చింది. సామ్రాట్‌ తో వివాహం అనేది అసు ఆలోచనే లేదు అంటూ తేజస్వి చెప్పుకొచ్చింది. గేమ్‌ లో భాగంగా తేజస్వి ఇంట్లో ఉన్నన్ని రోజులు సామ్రాట్‌ తో ప్రేమను నటించిందా  అంటూ ఇప్పుడు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News