ఫోటో స్టొరీ: చలికాలం హగ్గుల సీజన్!

Update: 2018-12-18 11:36 GMT
ఓ రెండు రోజులనుండి హైదరాబాద్ లో చలి ఎలా ఉందంటే.. చర్మం మందంగా ఉన్నవారికి తప్ప మిగతా వారందరికీ ఊటీ.. డార్జీలింగ్ గుర్తొస్తోంది.  ముఖ్యంగా సాయంత్రం సమయంలో జర్కిన్లు.. స్వెటర్లు లేకుండా బయట అడుగు పెడితే చలికి గజగజ వణుకుతున్నారు జనాలు. మరి ఇలాంటి సీజన్లో తెలుగు బ్యూటీ తేజస్వి అందరికీ హగ్గులు అంటోంది.

'ఐస్ క్రీమ్' లాంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించినా కెరీర్ లో పెద్దగా బ్రేక్ రాలేదు. కానీ తేజస్వి  బిగ్ బాస్ లో పాల్గొని బాగా పాపులర్ అయింది.  ఈ జెనరేషన్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోనట్టుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాటు ఫోటోలు అప్లోడ్  చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  అడ్డంగా గీతలు ఉన్న ఒక ఫుల్ స్లీవ్స్ టీషర్ట్ వేసుకున్న తేజస్వి తన కాళ్ళ అందాలను చూపిస్తూ ఒక మైక్రో నిక్కర్ వేసుకుంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో అందంగా కనిపిస్తోంది.

ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "హైదరాబాద్ వాతావరణం బ్యూటిఫుల్ గా ఉంది..  మీ ప్రియమైన వారిని హగ్ చేసుకోండి.  అందరికీ నా హగ్గులు.  నిజమే.. చలికాలం లో జనాలకు కావలసినవి రగ్గులు లేదా హగ్గులు.. ఇక మందుబాబులకైతే పెగ్గులు!  ఏదేమైనా సభ్యసమాజానికి ఐస్ క్రీమ్ పాప కౌగిలింత సందేశం ఇచ్చింది కాబట్టి హగ్గులనే స్వీకరించండి.
Tags:    

Similar News