నేను కూడా హాట్ గా కనిపించగలను

Update: 2017-03-11 16:40 GMT
అచ్చ తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ.. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసేస్తూ కెరీర్ కంటిన్యూ చేస్తోంది. హీరోయిన్ గా చేస్తూ.. మధ్యమధ్యలో చిన్నా చితకా పాత్రలు చేయడం లాంటి మిస్టేక్స్ కారణంగా.. ఇంకా ఈమె కెరీర్ గాడిలో పడలేదని అంటారు. ఇప్పుడీ భామ తన తప్పులను సరిదిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా తేజస్వి తన సోషల్ మీడియా అకౌంట్ కు పెట్టిన ప్రొఫైల్ పిక్చర్ చూసి.. అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. తెలుగమ్మాయి ఇంతగా.. ఇంత కొత్తగా కనిపించడం చూసి షాక్ తినేశారు. బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో  తేజస్వి కనిపించడం నిజంగా షాకింగే. ఇం 'ఈ షూట్ రీసెంట్ గానే చేశాను. పక్కింటి అమ్మాయి మాదిరిగా కనిపించడం లేదా ఏంటి? ఇది హాట్ లుక్ అనే విషయం నాకు తెలుసు. నేను ఇలా కూడా కనిపించగలను. ఫిలిం మేకర్స్ ఈ విషయాన్ని గమనిస్తారని అనుకుంటున్నా' అంటూ ఓపెన్ ఆఫర్ రేంజ్ లో చెప్పింది తేజస్వి.

రవితేజ-అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో తేజస్వి నటిస్తోంది. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ కూతురిగా కీలకమైన పాత్ర చేస్తున్న తేజస్వి.. రాజా ది గ్రేట్ మూవీలో మొదటిసారిగా ఫుల్ లెంగ్త్ కామెడీ చేసేస్తున్నట్లు చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News