సూపర్ స్టార్ మహేష్ నటించిన `మహర్షి` టికెట్స్ ప్రీబుకింగ్ సేల్స్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆన్ లైన్ లో టిక్కెట్లు హాట్ కేకుల్లా ఎగిరిపోతున్నాయి. ఇప్పటికే తొలి వీకెండ్ టిక్కెట్లు దొరకని సన్నివేశం నెలకొంది. బుక్ మై షో సహా చాలా వరకూ ఆన్ లైన్ పోర్టల్స్ టిక్కెట్లు లేక బ్లాక్ అయిపోయిన సన్నివేశం కనిపిస్తోంది. మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్ టిక్కెట్టు రేటు పెంచుకుని విక్రయిస్తున్నా టిక్కెట్లు దొరకని సన్నివేశం నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం.. `మహర్షి`కి ఎక్స్ ట్రా షో వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని తెలుస్తోంది. ఈనెల 9 నుంచి 13 రోజుల పాటు అంటే మే 22 వరకూ ఒక షో డెయిలీ అదనంగా వేసుకునేందుకు తెరాస ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రోజూ నాలుగు ఆటలు ఆడించే థియేటర్లలో ఇకపై ఐదు ఆటలు ఆడించే వీలుందన్నమాట.
తాజా గేమ్ చూస్తుంటే.. మహర్షి ఇండస్ట్రీ నాన్ బాహుబలి రికార్డుల్ని అధిగమిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఓపెనింగ్ డే సహా తొలి మూడు రోజుల వసూళ్ల రికార్డుల్ని బ్రేక్ చేసే ఛాన్సుంది. అటుపై టాక్ ని బట్టి తొలివారం లోనూ నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసే వీలుంటుందేమో!! ఇప్పటికే టీజర్.. ట్రైలర్లకు చక్కని స్పందన వచ్చింది. సెన్సార్ టాక్ బావుందని చెప్పుకుంటున్నారు. ఇంత పాజిటివ్ వైబ్స్ మధ్య మహర్షి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజృంభిస్తుందో వేచి చూడాల్సిందే.