50 ఎక‌రాల్లో ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్లాన్?

Update: 2019-04-05 01:30 GMT
ఏపీ - తెలంగాణ డివైడ్ అనంత‌రం తెరాస గ‌వ‌ర్న‌మెంట్ టాలీవుడ్ కి ప్ర‌ధానంగా ఇచ్చిన ప్రామిస్ .. పూణే ఫిలిం ఇని స్టిట్యూట్ త‌ర‌హా ఇనిస్టిట్యూట్ ని హైద‌రాబాద్ లో నెల‌కొల్ప‌డం. అయితే అది ఇన్నాళ్ల‌లో ఇంకా పురుడు పోసుకునే ద‌శ‌లోనే ఉండ‌డం ఫిలింవ‌ర్గాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. తెరాస నాయ‌కులు అందుకు సిన్సియ‌ర్ గానే ప్ర‌య‌త్నించారు. స్థ‌ల సేక‌ర‌ణ కోసం న‌గ‌రం ఔట్ స్క‌ర్ట్స్ లో ప‌లుచోట్ల తిరిగారు. సినీప‌రిశ్ర‌మ పెద్ద‌ల్ని - అధికారుల్ని వెంట‌బెట్టుకుని వెళ్లారు. ఇక రేపో మాపో ఫిలిం ఇనిస్టిట్యూట్ కి పునాది రాయి వేసేస్తార‌నే అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. అయితే మ‌ధ్య‌లో ఏమైందో ఇప్ప‌టివ‌ర‌కూ అందుకు సంబంధించిన స‌మాచారమే లేదు.

ప‌లుమార్లు వేదిక‌ల‌పై తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ముందు సినీపాత్రికేయులు ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్ర‌స్థావ‌న తెచ్చారు. అందుకు సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ప‌రిష్కారం దొరుకుతుంద‌ని ఆయ‌న అన్నారు. స్థ‌ల సేక‌ర‌ణ చేస్తున్నామ‌ని తెలిపారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అందుకు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి అధికారిక స‌మాచారం లేదు. ఇదే విష‌యం బుధ‌వారం సాయంత్రం త‌ల‌సాని వార‌సుడు సాయికిర‌ణ్ యాద‌వ్ మీట్ & గ్రీట్ కార్య‌క్ర‌మంలోనూ పాత్రికేయుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

గులాబీ బాస్ రెండు ద‌ఫాలుగా ఎన్నిక‌ల్లో గెలిచి రెండు సార్లు సీఎం అయ్యారు. ఇంకా ఆ ఒక్క కోరిక నెర‌వేర‌లేదు. కనీసం ఈసారైనా పునాది రాయి వేస్తారా?  అని ప్ర‌శ్నిస్తే .. ప‌లువురు సినీ పెద్ద‌ల స్పంద‌న ఆస‌క్తి రేకెత్తించింది. అప్ప‌ట్లోనే రామోజీ పిలింసిటీ కి కూత‌వేటు దూరంలో ఓచోట 50 ఎక‌రాల స్థ‌లం చూశారు. సినీప‌రిశ్ర‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని అంతా భావించారు. కానీ ఏమైందో ఇంత‌లోనే మ‌న‌సు మార్చుకున్నారు. ఆ త‌ర్వాత మెహ‌దీప‌ట్నం మీదుగా ఔట్ స్క‌ర్ట్స్ కి వెళ్లి వేరొక స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మామిడి తోట ఉన్న ఏరియాకి ద‌గ్గ‌ర‌లోనూ స్థ‌ల  ప‌రిశీల‌న జ‌రిగింది. ఏదో ఒక చోట ఫిలిం ఇనిస్టిట్యూట్ రూప‌క‌ల్ప‌న చేయాల‌న్న ఆలోచ‌న ఇప్ప‌టికీ ఉంది. ప్ర‌పోజ‌ల్ వ‌ర‌కూ అలా ఉంది. అయితే అది పునాది రాయి ప‌డి కార్య‌రూపం దాల్చేదెపుడు? అన్న‌దానికి స‌రైన ఆన్స‌ర్ లేదు. దీనిపై ఎన్.శంక‌ర్ స్పందిస్తూ .. తెరాస ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఆ ఆలోచ‌న ఉంది. కేసీఆర్- కేటీఆర్ -త‌ల‌సాని త్ర‌యం అందుకు ప్లాన్ లోనే ఉన్నారు. పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ ని కొట్టేలా పెద్ద స్థాయిలో ఇనిస్టిట్యూట్ పెట్టాల‌న్న ఆలోచ‌న ఉంద‌ని తెలిపారు. అయితే అందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు. అయితే ఎంత స‌మ‌యం ప‌డుతుంది? అన్న‌దానిపైనే క్లారిటీ లేదని అర్థ‌మ‌వుతోంది. ఫిలిం ఇని స్టిట్యూట్ విష‌య‌మై స్థ‌ల సేక‌ర‌ణ వ్య‌వ‌హారం గురించి ఫెడ‌రేర‌ష‌న్ అధ్య‌క్షుడు కొమ‌ర వెంక‌టేష్ సైతం వివ‌రాలందించారు.
Tags:    

Similar News