సింగిల్ స్ర్కీన్ లో దేశంలోనే నెంబ‌ర్-1 తెలంగాణ‌!

Update: 2022-08-17 05:40 GMT
గ‌డిచిన ద‌శాబ్ధ‌ కాలంలో థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్ప‌టికే సింగిల్ స్ర్కీన్ థియేట‌ర్ల‌కి కాలం చెల్లింది. తెలుగు రాష్ర్టాల్లో చాలా చోట్ల సింగిల్  స్క్కీన్ థియేట‌ర్లు ఫంక్ష‌న్ హాల్స్ గా మారిపోయాయి. ఇక‌ మెట్రోపాలిటన్ సిటీస్ లో దాదాపు ఆక్యుపెన్సీ మ‌ల్టీప్లెక్స్ ల‌దే. ప్రేక్ష‌కులు మ‌ల్టీప్లెక్స్ ల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త సింగిల్  స్ర్కీన్ వీక్ష‌ణ‌కి ఇవ్వ‌డం లేదు.

సింగిల్ స్ర్కీన్  థియేట‌ర్లు కొద్దో గొప్పో ఉన్నా? వాటిలో కొన్ని స‌రైన మెయింట‌నెన్స్ లేకపోవ‌డంతో అటువైపుగా చూడ‌టం లేదు. చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లో..మున్సీపాలిటీల్లో ఉన్న వాటిని దిల్ రాజు..అల్లు అర‌వింద్..సురేష్ బాబు లాంటి వారు విక్ర‌యించి రెన్నోవేష‌న్  చేసి ప్రేక్ష‌కుల‌కు నాణ్య‌మైన ఎంట‌ర్ టైన్ మెంట్ ని అందించ‌గ‌ల్గుతున్నారు.

వాళ్లు గ‌నుక పూనుకోక‌పోయుంటే  అవి ఇప్ప‌టికీ అలాగే ఉండేవి. లేదంటే పూర్తిగా మూత‌ప‌డేవి. థియేట‌ర్ వ్య‌వ్య‌స్థ‌లో సౌత్ కి..నార్త్ కి మ‌ధ్య చాలా వ్య‌త్యాస‌మే ఉంది. అయితే అత్య‌ధిక సిట్టింగ్  కెపాసిటీ గ‌ల థియేట‌ర్ల‌లో దేశ వ్యాప్తంగా  నెంబ‌ర్ వ‌న్ స్థానం ప‌శ్చిమ బెంగాల్ లో ని అస‌న్ సోల్ లో నెల‌కొన్న మ‌నోజ్ టాకీస్ దేన‌ని తెలుస్తోంది. 1662 సీట్ల సామర్ధ్యంతో ఈ స్థానాన్ని సంపాదించింది.

ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లోని సంధ్య 70 ఎంఎం. ఈ థియేట‌ర్ సిట్టింగ్  కెపాసిటీ 1323. ఆ త‌ర్వాత మూడ‌వ స్థానంలో 1306 సామ‌ర్ధ్యంతో రంగ‌ది..దేవి థియేట‌ర్లు నిలిచాయి. ఇంకా భ‌జంగ‌-1292.. సుద‌ర్శ‌న్ 35 ఎంఎం -1216.. విశ్వ‌నాథ్ -1177..శ్రీరాములు -1152..స‌ప్త‌గిరి -1150 ..సంధ్య 35 ఎంఎం..సాయిరంగ‌- 1055 సిట్టింగ్ కెపాసిటీని క‌లిగి  ఉన్నాయి.

ఇక ఏపీలో విశాఖ‌ప‌ట్ట‌ణంలోని జ‌గ‌దాంబ 70 ఎంఎం-1016 కెపాసిటీతో టాప్ 20 స్థానంలో నిలిచింది. ఏపీలో 1000 దాటిని సామ‌ర్ధ్యం గ‌ల థియేట‌ర్లు ఇంకెక్క‌డా లేవు. ఇక చెన్నైలో రెండు థియేట‌ర్లు..బెంగుళూరులో 3 థియేట‌ర్లు ఉన్నాయి.  మొత్తంగా దేశ వ్యాప్తం చూసుకుంటే సింగిల్ స్ర్కీన్ ఆధిప‌త్యం తెలంగాణ‌లోని హైద‌రాబాదే న‌ని  చెప్పొచ్చు.

అయితే వీటి ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగానే మారుతోంది. థియేట‌ర్ కి జ‌నాలు మునుప‌టంతా ఆస‌క్తి చూపించ‌డం లేడు. ఒక‌ప్ప‌టి ఎగ్జైట్ మెంట్ ఇప్పుటి ప్రేక్ష‌కుల్లో క‌నిపించ‌లేదు. స్టార్ హీరోల సినిమాలు అయిన థియేట‌ర్లు హౌస్ ఫుల్ అవ్వ‌డం క‌ష్టంగా మారుతోంది. కంటెంట్ ప‌రంగాను ప్రేక్ష‌కులు పెట్టిన డ‌బ్బుకు న్యాయం జ‌రుగుతుందా? అన్న దృక్కోణంలో థియేట‌ర్ కి వ‌స్తున్నారు.

థియేట‌ర్లో  టైంపాస్ చేయ‌డానికి వ‌చ్చే ఆడియన్స్  త‌గ్గారు. సినిమాల విష‌యంలో ప్రేక్ష‌కుల అభిరుచిలో ఎన్నో మార్పులొచ్చాయి. కంటెంట్ ఉంటే క‌టౌట‌క్ తో ప‌నిలేద‌ని ఇప్ప‌టి సినిమా నిరూపిస్తుంది. స్టార్ హీరోలు న‌టించిన  'ఆచార్య‌'..'రాధేశ్యామ్' చిత్రాల‌కు  వ‌చ్చిన రెస్పాన్స్.. 'మేజ‌ర్'.. 'బింబిసార‌'..'సీతారామం'.. కార్తికేయ‌-2ల‌కు ద‌క్కిన ఆద‌ర‌ణ‌ని పోల్చితే ప్రేక్ష‌కుల్లో మార్పులు స్ఫ‌ష్టంగా అర్ధ‌మ‌వుతాయి.
Tags:    

Similar News