గుంటూరు టాకీస్.. పేరులోనే ఆంధ్రాకు చెందిన నగరం పేరుంది. సినిమా అంతా కూడా గుంటూరు నేపథ్యంలోనే సాగుతుంది. చాలామంది పాత్రధారుల భాష, యాస కూడా ఆంధ్రా స్టయిల్లో సాగుతుంది. ఐతే ఈ సినిమాకు తెలంగాణలో మంచి వసూళ్లు దక్కాయి. డివైడ్ టాక్ తో మొదలైన ఈ సినిమా తెలంగాణ వరకు సూపర్ హిట్ అయింది. బూతు సినిమా అని.. వల్గారిటీ ఎక్కువైందని.. టెంపో మిస్సయిందని.. స్క్రిప్ట్ వీక్ అని.. రకరకాల నెగెటివ్ కామెంట్లు వినిపించినప్పటికీ.. ఈ సినిమాకు తెలంగాణలో అంచనాల్ని మించి వసూళ్లు రావడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా తొలి పది రోజుల్లో రూ.5 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది.
నైజాం ఏరియా వరకే రూ.2.1 కోట్లు కలెక్ట్ చేసింది ‘గుంటూరు టాకీస్’. ఆంధ్రా, రాయలసీమలో కలిపి రూ.3 కోట్ల వసూళ్లు వస్తే.. తెలంగాణలో మాత్రమే రూ.2 కోట్లంటే ఇక్కడ ఈ సినిమా ఎంత బాగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. నైజాంలో 4.5 లక్షల మందికి పైగా తమ సినిమాను చూసినట్లు నిర్మాత ప్రకటించాడు. ఈ సినిమా స్థాయికి ఇది ఎక్కువే. రూ.3 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో ఈ సినిమాను తీర్చిదిద్దాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. ఆ లెక్కన చూస్తే పరీక్షల సీజన్లో ‘గుంటూరు’ టాకీస్ బాగానే పెర్ఫామ్ చేసినట్లు లెక్క. అడల్ట్ కామెడీని ఇష్టపడే వారిని ‘గుంటూరు టాకీస్’ బాగానే మెప్పించింది. రష్మి అందాలు కుర్రకారుకు బాగానే కిక్కెక్కించాయి. మొత్తానికి టాక్ ఎలా ఉన్నా.. సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది.