డబ్బులు అడిగితే.. నెంబర్ బ్లాక్ చేసాడు: నిర్మాత పై నటి

Update: 2020-05-15 08:10 GMT
డబ్బులు లేవని ఓ నిర్మాతను అడిగితే.. ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి నెంబర్ బ్లాక్ చేసిన వైనం తాజాగా ఓ నటికి ఎదురైంది. దేశంలో లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమలతో పాటు సినీతారల పై ఆర్ధికంగా పెద్ద దెబ్బే పడింది. రాను రాను క్యారెక్టర్ ఆర్టిస్టులు, కొత్త నటులు అప్పులపాలు అయ్యేలా కన్పిస్తున్నారు. గత రెండు నెలలుగా లాక్ డౌన్ లో ఉంటున్న నటీనటులకు ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి కష్టాలే టెలివిజన్ నటి సోనాల్ వెంగర్‌లేకర్‌ ఎదుర్కుంటోంది. ఈ లాక్ డౌన్ వలన ఈ రెండు నెలల్లో తన వద్ద ఉన్న మనీ మొత్తం అయిపోయిందట. ఇక ఆలోచిస్తే.. తనకు డబ్బులు ఇవ్వాల్సిన నిర్మాత గుర్తొచ్చి కాల్ చేసిందట. పరిస్థితి అర్థం చేసుకొని సహాయం చేస్తాడేమో అని నిర్మాతకు కాల్ చేస్తే సోనాల్ కి చేదు అనుభవమే ఎదురైంది. అలాగే తనకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన ఆ నిర్మాత చాలా రోజుల నుండి కాల్ చేస్తే స్పందించడం లేదట.

చివరికి ఓసారి లిఫ్ట్ చేసి.. ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కావాలని అడిగితే.. ఆ నిర్మాత ఇవ్వడం కుదరదు అన్నట్లు ముఖం చాటేసి కాల్ చేసాడట. అయితే మళ్లీ కాల్ చేద్దామని ట్రై చేస్తే బ్లాక్ నెంబర్ బ్లాక్ చేసాడని వాపోయింది. ఇక చేసేదేం లేక మేకప్ మ్యాన్ తో తన సమస్యను వివరించిందట. తన బాధను అర్థం చేసుకున్న మేకప్ మ్యాన్ పంకజ్ గుప్తా స్పందించి.. తన భార్య గర్బవతి గా ఉన్నా కూడా తన వద్ద ఉన్న డబ్బును నాకు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. తనకు ఎన్నో ఖర్చులు ఉన్నప్పటికీ తన వద్ద ఉన్న డబ్బు ఇవ్వడానికి సిద్దమయ్యాడు. తన వద్ద 15 వేల రూపాయలు ఉన్నాయని, కావాలంటే మీరు తీసుకొని.. తన భార్య డెలివరీ సమయానికి అందిస్తే చాలని చెప్పాడు. మేకప్ మ్యాన్ మంచితనానికి నేను కన్నీటి పర్యంతం అయ్యానని సోనాల్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలిపింది. లక్షల డబ్బులు ఉన్న నిర్మాతనేమో ముఖం చాటేశాడు. కానీ తనకు అవసరమని తెలిసినా మేకప్ మ్యాన్ డబ్బులు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. డబ్బులు ఉన్నవారికి లేనివారికి మధ్య బేధం తెలిపే సంఘటన ఇదని సోనాల్ భావోద్వేగానికి గురయ్యింది.
Tags:    

Similar News