'ఇడియట్‌' ఫ్రెండ్‌ మృతి

Update: 2019-04-29 05:47 GMT
రవితేజ హీరోగా నటించిన 'ఇడియట్‌' చిత్రంలో ఫ్రెండ్‌ పాత్రలో నటించిన సుభాష్‌ చంద్రబోస్‌ నటుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అతడు ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు. ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్న ఈ నటుడు కొన్ని రోజుల క్రితం బాత్‌ రూంలో జారి పడ్డాడు. ఆ సమయంలో తలకు బలమైన గాయం అవ్వడంతో హాస్పిటల్‌ లో జాయిన్‌ చేశారు. కుటుంబ సభ్యులు సుభాష్‌ ను ఆర్థిక ఇబ్బందుల కారణంగా గాంధీ హాస్పిటల్‌ లో జాయిన్‌ చేయడం జరిగిందట.

కొన్ని రోజులుగా గాంధీలో చికిత్స పొందుతున్న సుభాష్‌ తాజాగా మృతి చెందాడు. ఇండియట్‌ తో పాటు ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి - ప్రస్తుతం స్టార్‌ హీరోలకు స్నేహితుడి పాత్రలో - అన్న పాత్రలో - తండ్రి పాత్రల్లో నటించాడు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన సమయంలో బుల్లి తెరపై కూడా సుభాష్‌ ప్రయత్నాలు చేశాడు. ప్రస్తుతం బుల్లి తెరపై అడపా దడపా కనిపిస్తూ వస్తున్న సుభాష్‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన గాంధీ హాస్పిటల్‌ లో చికిత్స చేయించుకున్నాడని - ప్రైవేట్‌ హాస్పిటల్‌ కు వెళ్లలేక పోయాడు అంటూ సమాచారం అందుతోంది. సుభాష్‌ మృతితో సినిమా పరిశ్రమలో ఆయనకు సన్నిహితంగా ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.
Tags:    

Similar News