బాహుబలి జై హొ బాహుబలి ఇలా సాగుతుంది మన మీడియా మరియు ప్రేక్షకుల శంఖారావం. అసలు బాహుబలి గురించి ఏమి విన్న అందరూ చెవులు ఎక్కించి మరి వింటున్నారు. మార్కెట్ బాగా ఉన్న సినిమా.. కంటెంట్ దండిగా ఉన్న సినిమా.. పైగా మన వాళ్ళు తీసిన సినిమా.. ఇవి సరిపోవా మన వాళ్ళు హర్ట్ అవ్వడానికి. అవును మన వాళ్ళు హర్ట్ అయ్యారు. దేనికి అనేగా మీ సందేహం. పదండి చూద్దాం.
ఈ నెల ఏప్రిల్ 28 నా విడుదల అవుతున్న బాహుబలి 2 మొదటి సారిగా హింది వర్షన్ ఏప్రిల్ 27 రాత్రి ముంబై లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లు ఆల్రెడీ చెప్పుకున్నాం. హింది లో డిస్ట్రిబూటింగ్ చేస్తున్న కరణ్ జోహర్ ఈ ఈవెంట్ కి ముఖ్య కారకుడు. బాహుబలి 1 కూడా ముందుగా అక్కడే ప్రీమియర్ షో వేశారు బాహుబలి టీమ్. ఇక్కడ మన వాళ్ళ గోల ఏంటి అంటే మన తెలుగు సినిమా మొదటి ప్రదర్శన తెలుగులో అయితే చాలా బాగుండేది. హిందీలో ముందు విడుదల అయ్యి కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న ముందు గానే సోషల్ మీడియా ద్వారా తెలిస్తే కిక్ ఉండదు కదా అంటున్నారు.
పార్టు 1 విడుదల అప్పుడు కూడా ముంబయ్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేసి విడుదలకు ముందే కాస్త హర్టు చేశాడు రాజమౌళి. ఇప్పుడు కూడా బాలీవుడ్డే ముద్దు అన్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. ప్రమోషన్లు కూడా ఇక్కడకంటే అక్కడే ఎక్కుగా సాగుతున్నాయి. ఇవన్నీ చూసి సగటు తెలుగు ప్రేక్షకులు హర్టవుతున్నాడనే చెప్పాలి. ఎమోషన్ పీపుల్ కదా వాళ్లకి బిజినెస్ లాజిక్ లు ఏమి అర్ధం అవుతాయిలే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/