విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిలిం 'నోటా' మరో మూడు రోజుల్లో అక్టోబర్ 5 న రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళ - తెలుగు ద్విభాషా చిత్రం కావడంతో రెండు భాషల్లో విడివిడిగా సెన్సార్ చేయించుకోవాలిసి ఉంది. తమిళంలో ఇప్పటికే 'నోటా' సెన్సార్ పూర్తయింది. తమిళ వెర్షన్ కు సెన్సార్ వారు 'U' సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ రోజు విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ తమిళంలో 'U' సర్టిఫికేట్ వచ్చిందని.. తెలుగులో 'నోటా' ను ఏం చేస్తారో అనే అనుమానం వ్యక్తం చేశాడు.
తెలుగు వెర్షన్ సోమవారం నాడు సెన్సార్ ముందుకు వెళ్ళింది. ఇక విజయ్ ఊహించినట్టే సెన్సార్ వారు కొన్ని డైలాగులు మ్యూట్ చేయాలని - మరి కొన్ని సీన్స్ తీసేయాలని చెప్పారట. వీటికి తోడు.. ఒక భారీ బూతు మాట సినిమాలో చాలా సార్లు రిపీట్ అవుతుందట. దాన్ని కూడా తీసేయాలని గట్టిగా పట్టుబట్టారట. త్వరలో ఎన్నికలు రానున్నాయనని ఈ సందర్భంలో నోటా లాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో ఇలాంటి వాటిని చూసి చూడనట్టు వదిలేస్తే.. రిలీజ్ అయిన తర్వాత సెన్సార్ బొర్డ్ కు విమర్శలు తప్పవని భావిస్తున్నారట.
దర్శకుడు ఆనంద్ శంకర్ తమిళుడు కావడంతో విజయ్ దేవరకొండ సెన్సార్ బోర్డ్ సభ్యులకు సినిమా కథ.. సన్నివేశాలు.. ఎలాంటి పరిస్థితిలో అలాంటి డైలాగులు వాడాల్సి వచ్చింది అని వివరించే ప్రయత్నం చేశాడట. విజయ్ ఇంతా వివరించినా సెన్సార్ వారు మాత్రం కొన్ని డైలాగుల విషయంలో - ఒక బూతు మాట విషయంలో మాత్రం ససేమిరా అన్నారట. దీంతో కొన్ని సీన్స్ తొలగించి.. మరి కొన్ని చోట్ల డైలాగులను మ్యూట్ చేయడానికి నోటా మేకర్స్ - సెన్సార్ వారి మధ్యలో అంగీకారం కుందిరిందట. ఆ మార్పులన్నీ చేసిన వెర్షన్ ను సెన్సార్ కు మళ్ళీ సబ్మిట్ చేస్తే.. U/A సర్టిఫికేట్ ఇస్తారట.