మన సత్తా ఎన్నారైలను చేరడానికేనా?

Update: 2015-05-25 09:30 GMT
మార్కెట్‌ను పెంచుకోవడం అనే విషయంలో మాన టాలీవుడ్‌ బాగా వెనుక పడిపోయింది అనేది ఓ నమ్మదగిన నిజం. ఎందుకంటే మనం ఎప్పుడూ టిక్కెట్లు రేట్లు పెంచండి బాబోయ్‌ అంటున్నామే కాని, మార్కెట్టును పెంచుకునే ప్లాన్స్‌ వేయట్లేదు. అయితే ఈ మార్కెట్‌ను పెంచుకోవడం అంటే ఇంకో పది ఓవర్‌సీస్‌ లొకేషన్లలో సినిమా రిలీజ్‌ అవ్వడం కాదు సుమీ.

మ్యాటర్‌ ఏంటంటే.. బన్నీ వంటిస్టార్లు తొలిరోజునే తమ సినిమాలను డబ్బింగ్‌ చేసి మరీ ఇతర బాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. కాని మిగిలినవారు మాత్రం అమెరికాలో, కువైట్‌, లండన్‌లో తమ సినిమా రిలీజ్‌ అవ్వడమే పెద్ద విషయంగా ఫీలవుతున్నారు. అయితే ఇలా చేయడం వలన మార్కెట్‌ పెద్దగా ఎక్స్‌ప్యాండ్‌ అవ్వదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఫారిన్‌లో రిలీజ్‌ చేస్తే కేవలం ఎన్నారై తెలుగు వారు చూడటమేకాని అక్కడి లోకల్‌ ఆడియన్స్‌ను మనం సంపాదించలేం. అదే హాలీవుడ్‌ బాబులు చూడండి.. లోకల్‌ లాంగ్వేజ్‌లోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేసి.. తెలుగు నుండి కొరియన్‌ వరకు, జపనీస్‌ నుండి తమిళం వరకు అన్ని బాషల్లోనూ సినిమాను అందిస్తున్నారు. దాని వలన వారి సినిమాలకు ఫ్యాన్స్‌ పెరుగుతున్నారు, పైసల్‌ రాలుతున్నాయి. డాలర్లు పెట్టిన తీసిన సినిమాకు రూపాయల్లో కూడా కలెక్షన్లు బీభత్సంగా వచ్చేస్తున్నాయి.

సో, టాలీవుడ్‌ కూడా మన తెలుగు సినిమాలను వేరే బాషల్లోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే మార్కెట్‌ పెరిగే ఛాన్సుంటుంది. లేకపోతే ఎప్పటికీ మనమూ మన తెలుగు ఎన్నారైలే తెలుగు సినిమాలు చూసుకుంటూ కూర్చోవల్సి ఉంటుంది.
Tags:    

Similar News