బాక్సాఫీస్ వార్ రసవత్తరం

Update: 2016-03-02 17:30 GMT
సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు విరామం ఇవ్వడంతో వరుసగా చిన్న, మీడియం రేంజి సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. ప్రతివారం రెండు మూడు సినిమాలు రేసులో నిలుస్తుండటం విశేషం. గత శుక్రవారమైతే ఏకంగా ఏడు సినిమాలు రిలీజయ్యాయి. అందులో తెలుగు సినిమాలే ఐదుండటం విశేషం. ఇక వచ్చేవారం కూడా మూడు చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు బాక్సాఫీస్ సమరానికి రెడీ అవుతున్నాయి. ఇంకో తమిళ డబ్బింగ్ సినిమా సైతం అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

ఈ వారం బరిలో ఉన్న మూడు సినిమాలు కూడా ఆసక్తి రేపుతున్నవే. బాగా ఆడేలా కనిపిస్తున్నవే. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ మూవీ ‘శౌర్య’ గురించే. ‘కరెంటు తీగ’ లాంటి హిట్ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని క్లాస్ డైరెక్టర్ దశరథ్ తో జట్టు కట్టాడు మంచు మనోజ్. తన లుక్ పూర్తిగా మార్చుకుని కొత్తగా తయారయ్యాడు. మరోవైపు
దశరథ్ కూడా ఫ్యామిలీ సినిమాల హద్దుల్లోంచి బయటికి వచ్చి తొలిసారి థ్రిల్లర్ ట్రై చేశాడు. ట్రైలర్ అదీ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ‘అలా మొదలైంది’ లాంటి సెన్సేషనల్ మూవీతో అరంగేట్రం చేసి.. తర్వాత ‘జబర్దస్త్’ లాంటి డిజాస్టర్ తీసిన నందిని రెడ్డి ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని తీసిన ‘కళ్యాణ వైభోగమే’ కూడా ఆసక్తి రేపుతోంది. నాగశౌర్య, మాళవిక జంటగా నటించిన ఈ సినిమాలో ఓ కళ కనిపిస్తోంది. పాజిటివ్ బజ్ నెలకొంది ఈ సినిమాపై. మరోవైపు ‘చందమామ కథలు’తో నేషనల్ అవార్డు గెలిచిన ప్రవీణ్ సత్తారు ‘గుంటూరు టాకీస్’తో ఆసక్తి రేపుతున్నాడు. యాంకర్ రష్మి ఈ సినిమాలో హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్లలో సెగలు రేపుతోంది. సాయి కొర్రపాటి లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. మొత్తానికి ఈ మూడు సినిమాలు కూడా ఆసక్తి రేపుతున్నవే. వీటితో పాటు తమిళ డబ్బింగ్ మూవీ ‘శివగంగ’ కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News