ఓటీటీల కారణంగా బిజీగా మారుతున్న తెలుగు ముద్దుగుమ్మలు..!

Update: 2020-11-10 23:30 GMT
ఓటీటీల కారణంగా ఇన్నాళ్లూ వెండితెరకు మాత్రమే పరిమితమైన నటీనటులు.. ఇప్పుడు డిజిటల్‌ తెరపై కనిపించడానికి ముందుకొస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఎప్పటి నుంచో ఉన్నవే అయినప్పటికీ కరోనా నేపథ్యంలో వీటి హవా పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రముఖ ఓటీటీలన్నీ కొత్త సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా తమ నిర్మాణంలో ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాయి. వీటి కారణంగా అప్ కమింగ్ నటీనటులకు టెక్నిషియన్స్ కి కావాల్సినంత పని దొరుకుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ - నెట్ ఫ్లిక్స్ - ఆల్ట్ బాలాజీ - జీ 5 వంటి ఓటీటీల‌ను ఉప‌యోగించుకుని ముంబైలో ఉన్న అప్ క‌మింగ్ హీరోయిన్లు త‌మ అవ‌స‌రాల‌కు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగునాట కూడా ఈ ప‌ద్ధ‌తి ఊపందుకుందని తెలుస్తోంది.

తెలుగు షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ ఇండ‌స్ట్రీలోకి రావాల‌నుకుంటున్న చాలామంది అమ్మాయిలకు ఓటీటీలు రూపొందించే వెబ్ సిరీస్ లు - ఇండిపెండెంట్ సినిమాలు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. చిన్న సినిమాల్లో న‌టించే కంటే పెద్ద పెద్ద వెబ్ సిరీస్ లో నటిస్తే బెట‌ర్ అనే ధోరణి ఇప్పుడు తెలుగు ముద్దుగుమ్మ‌ల్లో క‌నిపిస్తోంది. అదే వెబ్ సిరీస్ లు సక్సెస్ అయితే ఫ్యూచర్ లో ఎలాగూ క్రేజీ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలుగు ఓటీటీ 'ఆహా'తో పాటు పలు ఓటీటీలు రూపొందించే వెబ్ కంటెంట్ లో అనేకమంది తెలుగు అమ్మాయిలు నటిస్తున్నారు. పునర్నవి భూపాళం - చాందినీ చౌదరి - పూజిత పొన్నాడ వంటి తెలుగు అందాలు ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయి ఇప్పుడు ఓటీటీ స్టార్స్ గా వెలుగొందుతున్నారు. ఏదేమైనా ఓటీటీలు వచ్చాక చాలామందికి అవకాశాలు వస్తున్నాయనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం.
Tags:    

Similar News