విదేశీ మార్కెట్టే మనకు దిక్కా?

Update: 2016-11-14 19:30 GMT
ప్రధాని మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల బ్యాన్ కారణముగా చాలా రంగాలలో లావాదేవీలు ఆగిపోయిన సంగతి తెలిసినదే. ఆ ఎఫెక్టడ్ లిస్ట్ లో సినిమా రంగంకూడా వుండడం గమనార్హం. కోటానుకోట్ల బడ్జెట్ లో తెరకెక్కే సినిమాలు కొన్ని రోజులుగా నీరసించిపోయాయి. ఈ క్రమంలో ఎన్నారైలు పలు విధాలుగా సినిమా ఇండస్ట్రీని ఆదుకుంటాయని భావిస్తున్నారు.

తొలిరోజు కలెక్షన్ల విషయంలో భారీ మార్పులు వచ్చే అవకాశమున్న ఈ సందర్భంలో అమెరికా టిక్కెట్ రేట్ కాస్త తగ్గిస్తే అక్కడి కలెక్షన్లు పుంజుకుని కాస్త సహాయపడతాయని అంచనా. ఇటీవల విడుదలైన సాహసమే శ్వాసగా సాగిపో చిత్రం తొలిరోజు కేవలం 1.2కోట్లు వాసులు చెయ్యడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది.

అలానే ఇప్పటివరకూ వున్న ఫైనాన్షియర్స్ ప్రస్తుతం తమ డబ్బులు మార్చుకునే క్రమంలో వున్నారు గాబట్టి విదేశాలలో స్థిరపడ్డ బడా బాబులనుండి కొన్ని పెద్ద సినిమాలకు ఫైనాన్స్ ఆశిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి కొన్నాళ్ళపాటూ ఎన్.ఆర్.ఐ లే మన సినిమాలను పెంచి పోషించాలన్నమాట.    

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News