నాన్నని టార్గెట్ చేస్తూ బొమ్మలు పడుతున్నాయ్..

Update: 2016-09-07 17:30 GMT
పురాణాలలోనే కాదు మన సినిమాలలో అంతెందుకు నిజజీవితంలో కూడా లైం లైట్ లోకి రాకుండా మరుగున పడిపోయిన క్యారక్టర్ నాన్న అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకానొక తన సినిమా ఆడియో ఫంక్షన్ లో వెల్లడించాడు. నిజమే ఇక్కడ మథర్ సెంటిమెంట్ వర్కయింతగా ఫాథర్ సెంటిమెంట్ హిట్ అయినా దాఖలాలు గతంలో లేవు. అయితే ఇప్పుడు పధ్ధతి మారింది. ఫాథర్ సెంట్రిక్ స్టోరీస్ టాలీవుడ్ లో ఊపందుకుంటున్నాయి.

ఇటువంటి స్టోరీలను పెద్ద హీరోలే అంగీకరించడం ప్లస్ పాయింట్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలలో తండ్రీ కొడుకుల మధ్యనున్న అద్భుతమైన అనుబంధాన్ని చాటింది. కొరటాల శివ తీసిన మూడు సినిమాలలో తండ్రి పాత్రకు మంచి ప్రాముఖ్యతని పొందుపరిచాడు.

తాజాగా విడుదలైన రామ్ 'హైపర్' టీజర్ లో తండ్రంటే అమితమైన ప్రేమ కలిగిన కొడుకు పాత్రలో రామ్ కనిపించి ఆసక్తి రేకెత్తించాడు. చిరంజీవి అప్పట్లో చేసిన అందరివాడు రీతిలో ఈ స్టోరీ వుంటుందని అంచనా. ఏది ఏమైనా టాలీవుడ్ లో నాన్న పాత్రకు కూడా మంచి వెయిట్ పెరగడం శుభసూచకమే.
Tags:    

Similar News