తెలుగు సినిమాల్లో హీరోయిజానికి లోటుండదు. అందునా కమర్షియల్ సినిమాల్లో హీరోయిజాన్ని ఎంతగా ఎలివేట్ చెయ్యాలో అంతగానూ ఎలివేట్ చేస్తారు డైరెక్టర్లు. హీరో తన ప్రేమ కోసమో.. కాదంటే కుటుంబం కోసమో చేసే పోరాటాలతోనే హీరోయిజం తిరుగుతోంది. అదే దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడే హీరోల కథలు టాలీవుడ్ తెరకెక్కింది చాలా తక్కువ. ఈ విషయంలో బాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్టులతో అక్కడ దేశభక్తి నిండిన సినిమాలు వస్తూనే ఉన్నాయి.
రొటీన్ కమర్షియల్ ట్రెండ్ నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మన హీరోలు కూడా దేశభక్తి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి లార్జర్ దాన్ లైఫ్ తరహాలో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి దేశభక్తితో నిండిన కథాంశమే. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలొదిలిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథతో తెరకెక్కుతున్నదే. మరో మెగా హీరో అల్లు అర్జున్ లేటెస్ట్ గా చేస్తున్న నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా కూడా దేశభక్తిని ప్రబోధించే సినిమాయే. ఇందులో అల్లు అర్జున్ ఇంటికంటే దేశం ముఖ్యమని నమ్మే ఆర్మీ ఆఫీసర్ గా ఇందులో కనిపించనున్నాడు. టాలీవుడ్ కండలవీరుడు రానా అయితే ఇప్పటికే చేసిన ఘాజీ మన నావికాదళం సత్తా చాటిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన చిత్రమే.
‘‘ఏ భాషలో అయినా దేశభక్తి నిండిన సినిమాకు మంచి ఆదరణ ఉంది. ఇంతవరకు వచ్చిన దేశభక్తి సినిమాల్లో చాలావరకు సక్సెస్ అయ్యాయి. దేశం పట్ల ఉండే బాధ్యతను గుర్తు చేయగలిగేలా సినిమా ఉంటే చాలు అది కచ్చితంగా ప్రేక్షకాదారణ పొందుతుంది. కాకపోతే ఈ తరహా సినిమాలకు రీసెర్చ్ చేయాలి. దానికి టైం ఎక్కువే పడుతుంది’’ అని చెప్పుకొచ్చాడు ఘాజీ డైరెక్టర్ సంకల్స్ రెడ్డి.
దేశభక్తి సినిమా తీయడమంటే మిగతా సినిమాలతో పోలిస్తే కాస్త కష్టమైన అంశం. దానికి బోలెడు బడ్టెట్ ఖర్చుపెట్టాలి. సెట్లు వేయాలి. దీనికితోడు బాగా రీసెర్చ్ చేసుండాలి. ఇంత కష్టమెందుకని రెగ్యులర్ మసాలా చిత్రాలవైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఎఫ్పుడు చూసినా ప్రేక్షకులను కదిలించేది.. గుండెలను గర్వంగా ఉప్పొంగించేది దేశ భక్తి నిండిన చిత్రాలే. ఇప్పుడు వస్తున్న చిత్రాలు ఈ ట్రెండ్ ను మార్చగలిగితే తెలుగులోనూ మరిన్ని దేశభక్తి సినిమాలు వచ్చే అవకాశం ఉంది.