శివరాత్రి పండుగ చేసుకునేదెవరో

Update: 2017-02-17 07:32 GMT
ఈ మహాశివరాత్రి రోజున.. అంటే ఫిబ్రవరి 24న మూడు సినిమాలు రిలీజ్ కాబోతోన్నాయి. వారం వారం సినిమాలు థియేటర్లలోకి రావడం మామూలే అయినా.. ఫిబ్రవరి చివరివారంతో సినిమాలకు తగిన సీజన్ దాదాపుగా ముగిసిపోతుంది. ఆ తర్వాత పరీక్షల సీజన్ మొదలు కానుండడంతో.. సహజంగా పెద్ద సినిమాలేమీ థియేటర్లలోకి రావు.

ఫిబ్రవరి 24న విన్నర్.. మంచులక్ష్మి మూవీ లక్ష్మీ బాంబ్.. విజయ్ యాంటోనీ డబ్బింగ్ సినిమా యమన్ లు థియేటర్లలోకి వస్తున్నాయి. సాయిధరంతేజ్-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ కమర్షియల్ ఎంటర్టెయినర్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్.. ఈ చిత్రంపై అంచనాలను బాగా పెంచేసింది. మంచు లక్ష్మి నటించిన 'లక్ష్మీబాంబ్' పై కూడా హోప్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రంలో.. మంచు లక్ష్మి నటవిశ్వరూపం చూపించనుందట.

తమిళ్ మూవీ యమన్ ను తెలుగులో అదే పేరుతో తీసుకొస్తున్నాడు విజయ్ యాంటోనీ. బిచ్చగాడు తర్వాత ఇతగాడికి ఇక్కడ కూడా బాగా క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. శివరాత్రితో సినిమాల సీజన్ కు బ్రేక్ పడనుండగా.. ఆ తర్వాత వచ్చే వాటిలో ఒకటి అరా మినహాయిస్తే.. మిగతావన్నీ చిన్న సినిమాలే. అందుకే ఈ సీజన్ లో చివరగా సక్సెస్ సాధించేదెవరా అనే ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News