గత నెలలో మహర్షి లాంటి స్టార్ హీరో సినిమా తప్ప ఇంకేదీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. వివాదాల వల్ల కొన్ని పబ్లిసిటీ పుణ్యమా అని కొన్ని మీడియం రేంజ్ మూవీస్ ఓపెనింగ్స్ తెచ్చుకోగలిగాయి కానీ కనీసం రెండో వారం దాకా ఆ స్టెబిలిటీని మైంటైన్ చేయలేకపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మరో సినిమా లేక మూవీ లవర్స్ అల్లాడిపోయారు. ఇంకో సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు
ఇప్పుడు జూన్ వచ్చేసింది. 6వ తేది హిప్పీ 7న కిల్లర్ తో కొత్త సినిమాల తాకిడి మొదలవుతుంది. అంతకుముందు 5న సల్మాన్ ఖాన్ భరత్ ఉంది కానీ అది అందరికి టార్గెట్ అయ్యేది కాదు కాబట్టి టాలీవుడ్ కౌంట్ లోకి రాదు. ఆరెక్స్ 100 ఇమేజ్ వల్ల హిప్పీకి బజ్ ఎంతో కొంత ఉంది. విజయ్ ఆంటోనీ హీరో అనే ఫ్యాక్టర్ తప్ప ఇంకే అనుకూలాంశం లేని కిల్లర్ కూడా సైలెంట్ గా వస్తోంది. కేవలం టాక్ మీదే ఆధారపడ్డ సినిమాలివి
ఇక ఆపై వారం అంటే 14న విశ్వామిత్ర ఒకటే ప్రస్తుతానికి షెడ్యూల్ చేసి ఉంది. ఇంకేదైనా చిన్న సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. 21న మాత్రం గట్టి పోటీ కనిపిస్తోంది. చేనేత కార్మికుడి బయోపిక్ గా రూపొందిన మల్లేశం మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. దీంతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే కామెడీ థ్రిల్లర్ కూడా రేస్ లోకి వచ్చింది. నిఖిల్ అర్జున్ సురవరం అదే డేట్ అని అన్నారు కానీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక చివరి వారం 28వ తేదీ ఏ తెలుగు సినిమా ఇప్పటికి లాక్ కాలేదు. సో జూన్ మొత్తం ఇలా చిన్న సినిమాలతో సర్దుకోవాల్సిందే తప్ప భారీ హంగామాలు ఆశించే ఛాన్స్ మాత్రం లేనట్టే