ఏంటో.. సప్పసప్పగా ఉందబ్బా!!

Update: 2017-06-29 07:26 GMT
అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి.. ఈ లైను మన తెలుగు సినిమాల రిలీజులకు చక్కగా అప్లయ్ చెయ్యొచ్చు. అయితే బోలెడన్ని సినిమాలు ఒకేసారి రంగంలోకి దూకేస్తాయి.. లేదంటే అసలు బాక్సాఫీస్ వైపు కూడా కన్నెత్తి చూడరు. ఇక గత వారం అంటే 'డిజె దువ్వాడ జగన్నాథమ్' మానియా దున్నేసింది కాబట్టి.. దియేటర్లన్నీ ఆ సినిమాకే వెళ్ళిపోయా. మరి ఈవారం పరిస్థితి ఏంటి?

నిజం చెప్పాలంటే.. ఈ వారం బాక్సాఫీస్ అంతా చప్పగా ఉంది. ఏదో చిన్న సినిమాలు తప్పిస్తే.. పేరు మోసిన ఫిలిం ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్దకు రావట్లేదు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ హీరోగా రూపొందిన 'జయదేవ్' వస్తోంది. ఈ సినిమాను ఏదైనా కొత్త తరహాలో అటు నిర్మాతలు ఇటు రవితేజ ప్రమోట్ చేసుంటే బాగుండేది. కాని జయంత్ సి పరాన్జీ పేరు తప్పిస్తే.. అసలు సినిమా గురించి ఏమీ వినబడట్లేదు. అలాగే వైరల్ క్రేజును సొంతం చేసుకున్న సంపూర్ణేష్‌ బాబు కూడా తన 'వైరస్'తో వస్తున్నాడు. ఈ సినిమాకు కూడా బి అండ్ సి సెంటర్లలో ధియేటర్లలో ట్రైలర్ ను చూపించి జనాలను క్రేజీగా ఆకట్టుకుందాం అనుకున్నాడు కాని.. అంతగా ఆ వ్యూహం ఫలించలేదు. అందుకే ఈ సినిమా గురించి కూడా బజ్ లేదు. ఇక 'కయ్యుం భాయ్' 'ప్రేమలీల పెల్ళి గోల' వంటి సినిమాల సంగతి తెలిసిందే. ఎలా చూసినా కూడా.. ఈ వారం రిలీజులన్నీ సప్పసప్పగానే అనిపిస్తున్నాయ్. సినిమాలోపల బీభత్సమైన కంటెంట్ ఉంటే కాని.. జనాలకు వీటి గురించి ఎక్కదేమో.

ఆ లెక్కన చూసుకుంటే.. ఆ పైవారం 'నిన్ను కోరి' 'మామ్' వంటి సినిమాలు వచ్చే వరకు ఇక 'డిజె' వారికి రాసిచ్చేసినట్లే. అందుకే రోజూ ఏదో ఒక స్టయిల్లో దిల్ రాజు అండ్ టీమ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండా కలక్షన్లు లాగేస్తున్నారు. సినిమా ఆడాలంటే కంటంట్ ఒక్కటే కాదు.. కాలం కూడా కలసి రావాలి అని ఊరికే చెప్పరు మరి!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News