టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా మూవీస్ కి రెడీ అవుతుంటే కోలీవుడ్ స్టార్స్ మాత్రం మన మార్కెట్ పై కన్నేసి బైలింగ్వల్ మూవీస్ తో రంగంలోకి దిగిపోతున్నారు. అయితే ఇందుకు ధీటుగా మన వాళ్లు కూడా సై అంటూ తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీస్ ని సైరన్ మోగించేశారు. అక్కడి వారు మన మార్కెట్ పై కన్నేస్తే మన వాళ్లు అక్కడి మార్కెట్ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే కొంత మంది హీరోలు బైలింగ్వల్ మూవీస్ ని రిలీజ్ చేసేస్తే మరి కొంత మంది తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.
తమిళ హీరోలు ధనుష్, విజయ్, శివ కార్తికేయన్ తమిళ, తెలుగు భాషల్లో బైలింగ్వల్ మూవీస్ కి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా తెలుగు మార్కెట్ పై కన్నేశారు. ధనుష్ 'సార్' మూవీతో రాబోతుంటే దళపతి విజయ్ 'వారసుడు' మూవీతో రాబోతున్నాడు. ఇక క్రేజీ హీరో శివ కార్తికేయన్ 'ప్రిన్స్ ' మూవీతో తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వీరికి ధీటుగా మన వాళ్లు కూడా పోటీకి సై అనేశారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ ఈ వరుసలో ముందున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామితో కలిసి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'ది వారియర్' మూవీలో నటిస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కించారు. ఉస్తాద్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీని జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఈ మూవీ తరువాత గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో మరో బైలింగ్వల్ మూవీకి రామ్ శ్రీకారం చుట్టబోతున్నారట.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. గతంలో బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో రామ్ హీరోగా గౌతమ్ మీనన్ ద్విభాషా చిత్రాన్ని చేయాలనుకున్నారు.
అది కాస్తా నానితో చేశారు. అదే 'ఎటో వెళ్లిపోయింది మనసు'. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కలిసి ద్విభాషా మూవీకి రెడీ అవుతున్నారట. దీని కోసం కథని దర్శకుడు గౌతమ్ మీనన్ రెడీ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదే తరహాలో నేచురల్ స్టార్ తను నటించిన ప్రతీ సినిమాని తమిళంలోనూ రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన 'శ్యామ్ సింగ రాయ్', 'అంటే సుందరానికి' మూవీస్ ని కూడా తమిళంతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న 'దసరా' మూవీని ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నాడు. వీరితో పాటు అక్కినేని వారి హీరో నాగచైతన్య కూడా బైలింగ్వల్ మూవీకి రెడీ అయిపోయాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఓ సినిమాని ఇటీవలే ప్రారంభించాడు కూడా. త్వరలో హరి డైరెక్షన్ లో గోపీచంద్ కూడా బైలింగ్వల్ మూవీకి రెడీ అయిపోతున్న విషయం తెలిసిందే. త్వరలో మరి కొంత మంది కూడా ఇదే బాట పట్టేలా వున్నారు.