సినిమా మొదలయ్యే ముందు బడ్జెట్ విషయంలో రికార్డుల గురించి మాట్లాడతారు. ఆ తర్వాత బిజినెస్ రికార్డుల గురించి చర్చ జరుగుతుంది. ఆపైన కలెక్షన్ల గోల ఎలాగూ ఉంటుంది. మధ్యలో శాటిలైట్ రైట్స్ విషయంలోనూ రికార్డుల గురించి మాట్లాడుకుంటారు అభిమానులు. ఐతే ఈ మోత ఇక్కడితో ఆగుతుందా అంటే ఆగదు. టీవీలో ఫస్ట్ టైం సినిమా ప్రసారమైనపుడు ఎంత టీవీ రేటింగ్ వచ్చిందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమే. దాన్ని బట్టి కూడా ఓ హీరో, ఓ సినిమా రేంజి ఏంటన్నది లెక్కగడుతున్నారు అభిమానులు.
ఇప్పటిదాకా తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ తెచ్చుకున్న సినమిఆ గబ్బర్‌సింగ్. దానికి 24 పాయింట్ల టీఆర్‌పీ వచ్చినట్లు అంచనా. ఈగ 22 పాయింట్లతో, మగధీర 21.5 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐతే ఎన్టీఆర్-పూరి జగన్నాథ్‌ల 'టెంపర్' మూవీ ఈ రికార్డులన్నింటినీ దాటేసిందని సమాచారం. లాస్ట్ వీకెండ్‌లో జెమిని టీవీలో ప్రసారమైన ఈ సినిమా 26.5 పాయింట్ల టీఆర్‌పీ తెచ్చుకుని కొత్త రికార్డు నెలకొల్పినట్లు చెబుతున్నారు.
టెంపర్‌కు సూపర్‌హిట్ టాక్ వచ్చినా.. 50 కోట్ల క్లబ్‌లో చేరకపోవడంపై యాంటి ఫ్యాన్స్ సెటైర్లు వేశారు. ఐతే సినిమా విడుదలైంది డల్ సీజన్లో (ఫిబ్రవరి) కాబట్టి కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవన్నది వాస్తవం. బుల్లితెర మీద మాత్రం ఎన్టీఆర్ తన 'టెంపర్' చూపించడంతో నందమూరి ఫ్యాన్స్ మహదానందంతో ఉన్నారు.