ష్‌.. ఏనుగు సింహం క‌లిసి న‌టిస్తున్నాయ‌ట‌!

Update: 2020-08-07 05:00 GMT
ఏనుగుకి సింహం ఎదురైనా.. సింహానికి ఏనుగు ఎదురైనా సీనేంటో ఊహించ‌వ‌చ్చు. ఆ రెండూ బద్ధ శ‌త్రువులు. మీద పడి బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌లకు దిగుతాయి. త‌మిళ స్టార్ హీరోలు త‌ళా అజిత్ అభిమానులు.. ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమానులు.. ఎదురెదురు ప‌డితే సీన్ ఇంచుమించు అలానే ఉంటుంది. ఆ ఇరువురి ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వార్ ఇంత‌కుముందు క‌ల్లోల‌మే రేపింది. ప‌లుమార్లు బాహాబాహీకి త‌ల‌ప‌డిన సంద‌ర్భాలున్నాయి.

అందుకే ఇప్పుడు తళా అజిత్ .. ద‌ళ‌పతి విజయ్ క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తున్నారు! అన‌గానే స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఇదే నిజ‌మైతే ఆ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు సమీప భవిష్యత్తులో ఒకరితో ఒకరు స్నేహితులు అయిపోవ‌డం ఖాయం అంటూ కౌట‌ర్లు సోష‌ల్ మీడియాల్ని వేడెక్కిస్తున్నాయ్‌.

అజిత్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మ‌న్ క‌థ-2011 (గ్యాంబ్ల‌ర్‌) కు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు ఆ ఇద్ద‌రినీ క‌లిపి సినిమా తీస్తున్నార‌ట‌. మ‌న్ క‌థ సీక్వెల్ లో నటించమని అజిత్ .. విజయ్ ల‌ను ఒప్పించడానికి తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని అత‌డు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టించేందుకు ఆస‌క్తిగానే ఉన్నారు. కానీ స‌రైన క‌థ కుద‌ర‌లేద‌ని అందుకే ఆల‌స్య‌మైంద‌ని అన్నారు. ఇప్ప‌టికీ స్క్రిప్టు రెడీగా లేదు. రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట వెంక‌ట్ ప్ర‌భు.
Tags:    

Similar News