తమిళంలో రజినీకాంత్ తర్వాత అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రజినీకాంత్ సినిమాలు ఈ మద్య కాలంలో ఫ్లాప్ అవ్వడంతో ఆయన వీక్ అయిన కారణంగా ప్రస్తుతం విజయ్ నే తమిళ సినిమా ఇండస్ట్రీ టాప్ హీరో - సూపర్ స్టార్ అనే టాక్ కూడా వస్తుంది. విజయ్ చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ ముందు మినిమం కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంటుంది. మంచి సినిమాలు చేయడంతో పాటు మంచి మనసు కూడా ఉందని నిరూపించుకున్న విజయ్ కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులకు గురైనట్లుగా ఆయన సన్నిహితుడు - నటుడు సంజీవ్ చెప్పుకొచ్చాడు.
తాజాగా సంజీవ్ మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ మొదటి సినిమా ‘నాలయ తీర్పు’ విడుదలైన సమయంలో ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ లో అప్పట్లో ఒక కథనం వచ్చింది. ఆ కథనంలో విజయ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఇలాంటి వారు అంతా కూడా తమిళ ఇండస్ట్రీకి ఎందుకు వస్తున్నారు, ఈయన ఒక హీరోనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారట. ఆ కథనం చూసిన తర్వాత విజయ్ చాలా బాధ పడ్డాడ ని ఆ రోజు రాత్రంతా కూడా ఏడ్చేశాడు అంటూ సందీప్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం విజయ్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో విజయ్ ను ఏడిపించిన సదరు ఇంగ్లీష్ మ్యాగజైన్ ఆ తర్వాత అరడజను సార్లు విజయ్ ఫొటోను కవర్ పేజీపై వేసుకున్నట్లుగా కూడా సందీప్ పేర్కొన్నాడు. ఏ ఒక్కరిని వారి మొదటి ప్రయత్నం సమయంలో విమర్శించకూడదు. ఏ ఒక్కరు కూడా మొదటి ప్రయత్నంతోనే సక్సెస్ కాలేరు. వీలైతే వారికి మద్దతు ఇవ్వాలి తప్ప విమర్శిస్తే వారు కృంగిపోతారు. కాని విజయ్ మాత్రం కృంగిపోకుండా తన కెరీర్‌ను తన స్వశక్తితో బిల్డ్ చేసుకున్నాడు.