కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మృతి చెంది చాలా నెలలు అవుతోంది. ఆయన మృతి చెందిన సమయంలో యావత్ భారత సినీ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన చివరి చూపు కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు పలువురు బెంగళూరు చేరుకున్నారు. కన్నడ ముఖ్యమంత్రి కన్నీళ్లు పెట్టుకుని మరీ అంతిమ సంస్కారాలు నిర్వహించిన సంగతి ప్రతి ఒక్కరికి తెల్సిందే.
టాలీవుడ్ నుండి పలువురు స్టార్స్ బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కు శ్రద్దాంజలి ఘటించారు. కొందరు తెలుగు హీరోలు చనిపోయిన సమయంలో వెళ్లలేక పోయినా కూడా ఆ తర్వాత ఆయన సమాధి వద్దకు వెళ్లి శ్రద్దాంజలి ఘటించారు. కాస్త ఆలస్యంగా తమిళ హీరోలు స్పందించారు అనే విమర్శలు వచ్చాయి. కొందరు తమిళ హీరోలు పునీత్ చనిపోయిన సమయంలో శ్రద్దాంజలి ఘటించలేదు. కాని సోషల్ మీడియా విమర్శలు లేదా మరేదో కారణం వల్లనో కాని ఆలస్యం అయినా బెంగళూరు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పునీత్ చనిపోయిన ఇన్ని నెలల తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ ఘాట్ ను సందర్శించి నివాళ్లు అర్పించారు. పునీత్ చనిపోయిన ఇన్నాళ్లకు విజయ్ కి తీరిందా అంటూ కొందరు కన్నడ మీడియా వర్గాల వారు మరియు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. విజయ్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన ఇన్నాళ్లు కూడా విజయ్ బిజీగానే ఉన్నాడా అంటూ నెటిజన్స్ కొందరు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరుకు ఏదో పని మీద వచ్చిన విజయ్ పనిలో పని అన్నట్లుగా పునీత్ రాజ్ కుమార్ ఘాట్ ను సందర్శించాడు అనే కామెంట్స్ కూడా కొందరు చేస్తున్నారు. విజయ్ పర్యటన వివాదాస్పదం అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
విజయ్ పీఆర్ టీమ్ మాత్రం తమిళ మీడియా వద్ద స్పందిస్తూ.. ఇన్నాళ్లు బీస్ట్ సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా బిజీగా ఉన్న విజయ్ ఇప్పుడు ఫ్రీ అవ్వడంతో బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కు నివాళ్లు అర్పించారంటూ తెలియజేశారు. విజయ్ బీస్ట్ షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది.
ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని వారి ప్రకటనకు కౌంటర్ లు పడుతున్నాయి. ఇలాంటి విషయాలను వివాదాస్పదం చేయడం విడ్డూరంగా ఉందని.. విజయ్ ఇప్పటికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. కాని ఆయన తనకు పునీత్ పై ఉన్న గౌరవంతో శ్రద్దాంజలి ఘటించేందుకు బెంగళూరు వెళ్లాడంటూ విజయ్ అభిమానులు తమ అభిమాన హీరోపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.