అఫిషియల్‌.. రాధేశ్యామ్‌ బాక్స్ లు బద్దలే

Update: 2021-12-26 14:30 GMT
దేశ వ్యాప్తంగా ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్‌ సినిమా కోసం సినీ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఈ సినిమా గురించిన చర్చలు.. వార్తలు.. పుకార్లతో ప్రేక్షకులకు ముఖ్యంగా తెలుగు వారికి సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. జిల్‌ అనే ఒకే ఒక్క సినిమా ను తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణకు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఈ సినిమాను ఒక యజ్ఞంలా తెరకెక్కించారని తాజాగా విడుదల అయిన ప్రమోషనల్‌ స్టఫ్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ సినిమాను హిందీ మరియు సౌత్‌ భాషల కోసం వేరు వేరుగా షూట్‌ చేశారు. పాటలు మరియు బీజీ కూడా వేరు వేరుగా ఉండబోతున్నాయి. కనుక సినిమా ఒక్కటి కాదు రెండు చూసిన ఫీల్ కలుగబోతుంది.

ఇక ఈ సినిమాకు పాటలను వేరు వేరు సంగీత దర్శకులు సంగీతాన్ని అందించారు. ఇక తెలుగు వర్షన్ మరియు ఇతర సౌత్‌ భాషల వర్షన్‌ లకు థమన్‌ తో బీజీ ఇవ్వబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే థమన్ ఇలా సగం సగం పని చేయక పోవచ్చు.. ఆయన ఉన్న బిజీకి రాధే శ్యామ్‌ ఆర్‌ ఆర్‌ కు ఒప్పుకుంటాడో లేదో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని అఫిషియల్‌ గా రాధే శ్యామ్‌ సినిమాకు థమన్ బీజీ ఇవ్వబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. తాజాగా వచ్చిన అఖండ సినిమాకు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం అఖండకు మాత్రమే కాకుండా ఆయన బీజీఎం ఇచ్చిన ప్రతి సినిమా కూడా మంచి టాక్ ను దక్కించుకుంటుంది. కనుక రాధే శ్యామ్‌ కు ఆయన్ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ వారు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. రాధే శ్యామ్‌ సినిమా కు థమన్‌ ఇవ్వబోతున్న ఆర్‌ ఆర్‌ ఖచ్చితంగా సినిమా స్థాయిని పెంచుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. అఖండ సినిమా కు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ వల్ల బాక్సులు బద్దలు అవ్వడం.. చిన్న చిన్న ప్రమాదాలు జరగడం కూడా జరిగింది. మళ్లీ ఆ స్థాయి బీజీఎం కనుక థమన్‌ రాధే శ్యామ్ కు ఇస్తే ఖచ్చితంగా సినిమా మరింతగా అభిమానులకు మరియు ప్రేక్షకులకు చేరువ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభాస్ అండ్‌ టీమ్‌ థమన్‌ పై చాలా నమ్మకం పెట్టుకుని ఈ వర్క్ ను ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఒక సంగీత దర్శకుడు రఫ్ గా బీజీఎం చేశాడని.. కాని అది నచ్చని యూవీ వారు థమన్‌ ను ఫైనల్‌ చేశారు అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. సంక్రాంతికి రాబోతున్న రాధే శ్యామ్‌ థియేటర్లలో రీ సౌండ్‌ ఇవ్వడం ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు.



Tags:    

Similar News