టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎస్ఎస్ థమన్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ముఖ్యంగా గత రెండేళ్లుగా థమన్ ఫుల్ ఫార్మ్ లో కొనసాగుతున్నారు. చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందిస్తూ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయాడు. సినిమా సక్సెస్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ లో కీలకంగా మారిన తమన్.. ఇప్పుడు పెద్ద సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
థమన్ ఉంటే ఆ సినిమా ఆడియో రైట్స్ ఐదు కోట్ల వరకు పలుకుతాయనే ప్రచారం ఉంది. ఇలా నిర్మాతలు లాభాలు ఆర్జించడంలో తన వంతు కృషి చేస్తున్న స్టార్ కంపోజర్.. కవర్ సాంగ్స్ విషయంలో మాత్రం వారికి ఇబ్బందిగా మారుతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
'అల వైకుంఠపురములో' సినిమా విజయంలో మేజర్ క్రెడిట్ థమన్ కు దక్కుతుందని అనడంలో సందేహం లేదు. సంగీత దర్శకుడు కంపోజ్ చేసిన ప్రతీ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని ఇంస్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు లిరికల్ వీడియోలకు బదులుగా కొన్ని కవర్ సాంగ్స్ ను వదిలిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఐడియా వర్క్ ఔట్ అవడంతో థమన్ ఇప్పుడు తాను మ్యూజిక్ అందిస్తున్న పెద్ద సినిమాల విషయంలో లిరికల్ వీడియోలను కాకుండా.. కవర్ సాంగ్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల 'భీమ్లా నాయక్' మూవీకి థమన్ భారీ స్థాయిలో కవర్ సాంగ్స్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆలోచన ఎవరిదనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వీటిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. మంచి పాటలు అని ప్రశంసిస్తూనే.. కవర్ సాంగ్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు.
ఇప్పుడు థమన్ 'సర్కారు వారి పాట' సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న SVP ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదొక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ అని పేర్కొంటూ ఈ మేరకు ఓ పోస్టర్ ని కూడా వదిలారు.
అయితే మహేష్ బాబుకు సంబంధించిన ఫోటో కాకుండా కేవలం థమన్ కు ప్రాధాన్యత ఇస్తూ పోస్టర్ ని విడుదల చేయడంపై సూపర్ స్టార్ అభిమానులు నిరాశ చెందుతూ కామెంట్స్ పెట్టారు. అంతేకాదు సర్కారు వారి మొదటి పాట కవర్ సాంగ్ రూపంలో వస్తుందేమో అని సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లిరికల్ వీడియోకి బదులుగా కవర్ సాంగ్ రిలీజ్ చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలని నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. మరి SVP ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోగా రాబోతుందో లేదా థమన్ సారథ్యంలో కవర్ సాంగ్ గా వస్తుందో చూడాలి.