పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉందంటూ రివ్యూలు వస్తున్నాయి. సంగీత దర్శకుడు థమన్ మనసు పెట్టి ఈ సినిమాకు వాయించాడని కొందరు.. అభిమాన హీరో కోసం ది బెస్ట్ ను థమన్ ఇచ్చాడు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వకీల్ సాబ్ లో సంగీతంకు మంచి మార్కులు అయితే పడ్డాయి. ప్రస్తుతం సౌత్ లో ది బెస్ట్ సంగీత దర్శకుడిగా థమన్ పేరు మారు మ్రోగి పోతుంది. త్రివిక్రమ్ కు అత్యంత నమ్మకస్తుడిగా థమన్ మారిపోయాడు. అందుకే వకీల్ సాబ్ అవకాశం దక్కించుకున్నాడు... ఆ తర్వాత పవన్ మరియు రానాలు కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కు కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు.
వకీల్ సాబ్ హిట్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు అభిమానులు థమన్ ను ట్యాగ్ చేసి పవన్ తర్వాత సినిమాలో నీ మ్యూజిక్ మరింత మ్యాజిక్ చేయాలంటూ కోరుతున్నారు. థమన్ కు అయ్యప్పనుమ్ రీమేక్ కు సంగీతం అందించే బాధ్యతను స్వయంగా త్రివిక్రమ్ అప్పగించాడట. ఆ సమయంలో త్రివిక్రమ్ గారు థమన్ తో మ్యూజిక్ ఎలా ఉండాలంటే సింహం ఈ ఫారెస్ట్ అంతా నాదే అని గర్జించినట్లుగా ఉండాలంటూ చెప్పాడట. త్రివిక్రమ్ చెప్పినట్లుగానే పవన్ రానా ల సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడట.
ఈ విషయాన్ని ఒక అభిమాని ట్విట్టర్ లో షేర్ చేయగా దానికి థమన్ స్పందించాడు. ఇది మాస్.. కొడుతున్నాం మళ్లీ అంటూ రీ ట్వీట్ చేశాడు. మొత్తానికి అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కు మాస్ మసాలా సంగీతాన్ని అందించి దుమ్ము రేపేందుకు థమన్ సిద్దంగా ఉన్నాడన్నమాట. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ కు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ ను త్రివిక్రమ్ అందిస్తున్న విషయం తెల్సిందే.