నెలల తరబడి కష్టించి తీసిన సినిమాకి కేవలం తొమ్మిది పనిదినాల్లో రీరికార్డింగ్ చేసేయడం అంటే అది రికార్డే. అసలు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఓ సినిమాకి రీరికార్డింగ్ ఇవ్వాలంటే ఎంత సమయం తీసుకుంటారు? భారీ బడ్జెట్ సినిమాకి అయితే ఎంత సమయం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలు వేస్తే .. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలకు ఎవరైనా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కనీసం 20 నుంచి 30 రోజుల సమయం తీసుకోనిదే రీరికార్డింగ్ పూర్తి చేయలేరు.
అయితే ఈ రికార్డును బ్రేక్ చేశాడు తమన్. అతడు లేటెస్ట్ మూవీ బ్రూస్ లీకి కేవలం 9 రోజుల్లోనే రీరికార్డింగ్ పూర్తి చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. దేవీశ్రీ - మణిశర్మ - ఎం.ఎం.కీరవాణి వంటి దిగ్గజాలకు సాధ్యపడనిది మరి తమన్ కి ఎలా సాధ్యపడింది? ఏమో .. ఏదేమైనా అతడు ఆ రికార్డును తన పేరిట రాసి పెట్టుకున్నాడు. ఇప్పుడున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ జెట్ స్పీడ్ తో పాటలు, ఆర్ ఆర్ పూర్తి చేస్తాడన్న టాక్ ఉంది.
తమన్ మ్యూజిక్ కి మాస్ లో చక్కని పాపులారిటీ ఉంది. బ్రూస్ లీ రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్. ఆరెంజ్ తర్వాత ఆ రేంజు మ్యూజిక్ ఇచ్చాడని చెర్రీనే పొగిడేశాడు తమన్ ని. ఇప్పుడు రేయింబవళ్లు శ్రమించి బ్రూస్ లీ ఆర్ ఆర్ పూర్తి చేశాడు. 16న సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇంకా నాలుగు రోజులే .. కౌంట్ డౌన్ స్టార్ట్స్.