దేవీ పేరు మర్చిపోయావా థమన్ భయ్యా?

Update: 2019-11-23 11:15 GMT
టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులో ఉండేవారు దేవీ శ్రీ ప్రసాద్.. థమన్.   కొంతకాలం క్రితం వరకూ దేవీ నంబర్ వన్ ప్లేస్ లో ఉండేవాడు కానీ ఈమధ్య మాత్రం సాదా సీదా పాటలతో క్రేజ్ తగ్గింది.  పెద్ద స్టార్ హీరోలు తమ సినిమాలకు దేవీకి బదులుగా ఇతర మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం దేవీ చేతిలో ఉండే క్రేజీ ప్రాజెక్టు మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మాత్రమే.  ఈ సినిమా పాటలు నిరాశపరిస్తే దేవీకి కష్టమనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే దేవీ తర్వాత స్టార్ హీరోలు ఎక్కువగా ఎంచుకునే సంగీత దర్శకుడు థమన్ ఈమధ్య యమా జోరుతో దూసుకుపోతున్నాడు.  ముఖ్యంగా అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' పాటలు శ్రోతలను విపరీతంగా మెప్పిస్తున్నాయి.  దీంతో దేవీశ్రీ ప్రసాద్ - థమన్ ల నడుమ వృత్తిపరంగా భారీ పోటీ నెలకొందని అంటున్నారు.  నిన్న 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ రిలీజ్ అయింది.  టీజర్ కు మంచి స్పందన దక్కింది. ఈ టీజర్ ను ప్రశంసిస్తూ థమన్ ఒక ట్వీట్ చేశాడు.  అయితే ఈ ట్వీట్ లో మహేష్ బాబు.. అనిల్ రావిపూడి.. దిల్ రాజు పేర్లు ప్రస్తావించాడు కానీ దేవీ ప్రస్తావన తీసుకురాలేదు. టీమ్ అందరికీ అల్ ది బెస్ట్ చెప్పాడు. నిజానికి టీజర్లో మహేష్ బాబు.. విజయ శాంతి.. ప్రకాష్ రాజ్ ల సూపర్ డైలాగ్స్ ను ఎలివేట్ అయ్యేలా దేవీ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు.  సాధారణమైన ప్రేక్షకులు కొందరు గుర్తించలేకపోవచ్చు కనీ రిపీట్ మోడ్ లో టీజర్ చూస్తే వారికి కూడా అది తెలిసిపోతుంది.  మరి థమన్ కు ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది. థమన్ ఉద్దేశపూర్వకంగానే దేవీ పేరును ప్రస్తావించలేదని కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

అయితే థమన్ అభిమానులు మాత్రం అదేమీ లేదని.. అలా అయితే 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ను షేర్ చేస్తూ ట్వీట్ పెట్టి ఉండేవాడు కాదని.. ఇది పనిగట్టుకుని థమన్ ను ఆడిపోసుకోవడం తప్ప మరొకటి కాదని అంటున్నారు. చూస్తుంటే స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ తో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ల ఫ్యాన్స్ మధ్య కూడా రచ్చ మొదలవుతున్నట్టుగా అనిపిస్తోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News