టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ ఒక్క హిట్ వస్తే మూడు నాలుగు ఫ్లాప్ లు అన్నట్లుగా పరిస్థితి ఉంది. థమన్ వరుసగా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ లు దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన నుండి వచ్చిన ఆల్బం లు అల వైకుంఠపురం రేంజ్ లో లేదనే చెప్పాలి.
పాటల సంగతి పక్కన పెడితే కనీసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అయినా మంచి మార్కులు దక్కించుకుంటాడా అంటే అది కూడా కనిపించడం లేదు. అఖండ సినిమాకు బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లుగా... బోయపాటి యొక్క మాస్ ఎలిమెంట్స్ కు సరిగ్గా సూట్ అయ్యేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చిన థమన్ ఆ తర్వాత ఒక్క సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ఆకట్టుకోలేక పోయాడు.
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ కి ఇప్పుడు అతి పెద్ద ఛాలెంజ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లా కాకుండా గాడ్ ఫాదర్ ను విభిన్నమైన పొలిటికల్ డ్రామా గా రూపొందించడం జరిగింది. పాటలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.. కనుక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనే అత్యంత కీలకంగా మారింది.
అఖండ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గాడ్ ఫాదర్ కి అవసరం. అందుకే కాస్త ఎక్కువగానే థమన్ హోం వర్క్ చేశాడని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
గాడ్ ఫాదర్ నుండి ఇప్పటికే వచ్చిన పాట సో సో గానే ఉంది అంటూ టాక్ ను సొంతం చేసుకుంది. అందుకే గాడ్ ఫాదర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా యొక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటేనే తప్ప థమన్ గట్టెక్కినట్లు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ విషయంలో నిరాశ పర్చితే మాత్రం స్టార్ హీరోల సినిమాలన్నింటికి కూడా మళ్లీ దేవి శ్రీ ప్రసాద్ లేదా కొత్త వారు రంగంలోకి దిగాల్సి ఉంటుందంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.