తమన్‌ ఒక్కడే బతికిపోయాడు!!

Update: 2015-10-17 15:30 GMT
నో డౌట్‌. ఒక సినిమా రిజల్టు బయటకు వచ్చేశాక.. దాని దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌ బర్గ్‌ అయినా.. దానిలో హీరో మెగాస్టార్‌ చిరంజీవి వంటి ఉద్దండులు అయినా.. దాని సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ అయినా.. తిట్లు తినాల్సిందే. విమర్శల పాలవ్వాల్సిందే.

ఇప్పుడు ''బ్రూస్‌ లీ'' సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. ఒక ప్రక్కన ఇలాంటి సినిమాను ఎంచుకున్నందుకు ముందుగా అందరూ రామ్‌ చరణ్‌ నే అంటున్నారు. అంటే తాను శ్రీను వైట్ల మార్కు కామెడీ నటించేద్దాం అనుకుని.. చివరకు అది సాధించలేకపోయాడనమాట. ఇకపోతే శ్రీనువైట్ల అసలు ఇలాంటి పేలవమైన సేమ్‌ టు సేమ్‌ రిపీట్‌ కథనే ఎందుకు రాసుకున్నాడు? మూల కథలో మ్యాటర్‌ లేకపోతే ఇక మిగిలిన రైటింగ్‌ టీమ్‌ మాత్రం ఏం చేస్తుంది? కుదిరితే దూకుడు.. లేకపోతే బాద్షా.. ఈ రెండు సినిమాల్లోని సీన్లనూ మార్చి మార్చి చెబితే ఎలా గురువు గారూ అని అడుగుతున్నారు. మరి రొటీన్‌ రాతలే రాస్తున్న కోన-గోపి.. ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు అంటూ సేమ్‌ సోది ఎప్పటినుండో చెబుతున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో తాను చేసిన పనికి విపరీతమైన ఎప్రీసియేషన్‌ పొందుతున్న ఏకైక టెక్నీషియన్‌ ఎవరంటే.. అది కేవలం మన తమన్‌ బాబు ఒక్కడే అనే చెప్పాలి. మనోడు ఇచ్చిన పాటలు - బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌.. అలాగే మెగాస్టార్‌ క్యామియో కోసం కంపోజ్‌ చేసిన స్పెషల్ స్కోర్‌.. అన్నీ రచ్చ రచ్చ చేసిపాడేశాయి. అందరూ మనోడి ధియేటర్లలోనే పెద్ద పెద్ద 'ఓ'లు వేసేస్తున్నారహో!!
Tags:    

Similar News