చిరుని ప్రొటెక్ట్ చేసిన థమన్.. గ్రేట్ వర్క్!

Update: 2022-09-29 03:51 GMT
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో బుధవారం సాయంత్రం గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. అయితే పలు కారణాల వలన ఫ్లైట్ ఆలస్యం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆలస్యంగానే ఆ వేడుకకు వచ్చారు. అయితే ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా ఆయన అభిమానులకు ప్రత్యేకంగా క్షమాపణలు కూడా చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ మొదలుపెట్టే క్రమంలోనే అక్కడ భారీగా వర్షం కూడా పడింది.

అయినప్పటికీ కూడా మెగాస్టార్ అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా వర్షంలోనే తడుస్తూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా వర్షం పడుతూ ఉండగా ఎంతో సంతోషం వ్యక్తం చేసిన మెగాస్టార్ తన అసిస్టెంట్ గొడుగు పడుతున్నప్పటికీ కూడా అవసరం లేదు అని పక్కకు తోసేశాడు. ఇక వర్షంలోనే చాలా సంతోషంగా మాట్లాడిన మెగాస్టార్ తను ఎప్పుడు వచ్చినా కూడా అనంతపురంలో వర్షం పడుతుంది అని ఇది విజయానికి శుభసంకేతమని అన్నారు.

ఇక వరుణ దేవుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ ఫుల్ జోష్ లో మెగాస్టార్ మాట్లాడారు. అయితే హఠాత్తుగా వర్షం పడడంతో సెక్యూరిటీ లోపం వలన అభిమానులు ఒక్కసారిగా స్టేజి మీదకు వచ్చేసారు. చిరు వచ్చే క్రమంలో కొంతమంది గట్టిగా పట్టేసుకున్నారు కూడా. ఇక ఆ తర్వాత మాట్లాడుతున్న సమయంలో కూడా మెగాస్టార్ మీదకు దూసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పక్కన ఉన్న థమన్ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాడు. ఎంతలా అంటే పక్కనే ప్రత్యేకంగా స్పెషల్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ  వారి కంటే వేగంగా ఎదురుగా వచ్చిన అభిమానిని అడ్డుకున్నాడు. ఒక విధంగా బాస్ కు అతను బాడీగార్డ్ తర్వాత బాడీగార్డ్ తరహాలోనే ప్రొటెక్ట్ చేసేందుకు ప్రయత్నం చేశాడు.

అంతేకాకుండా హఠాత్తుగా వచ్చిన అభిమానిని చిరు సెక్యూరిటీ సభ్యులు కాలితో తన్నెందుకు ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా అభిమానిని ఏమీ అనకుండా తమను అడ్డుకున్నాడు. ఏదేమైనా కూడా ఒకవైపు మెగాస్టార్ ను ప్రొటెక్ట్ చేస్తూనే మరోవైపు ఆ అభిమానికి కూడా ఏమీ అనకుండా థమన్ చాలా సెన్సిటివ్ గా ఆలోచించాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full ViewFull View
Tags:    

Similar News