ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయ్యే సరికి త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఆలస్యం అవుతుందా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. వాయిదా పడనుంది అని కొన్ని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ ఎన్టీఆర్ అలాంటి వాటిని అస్సలు పట్టించుకోలేదు. అజ్ఞాతవాసి అయిపోగానే త్రివిక్రమ్ తో ఎక్కువగా ట్రావెల్ అయ్యాడు. ప్రస్తుతం కూడా కథపై చర్చలు బాగానే కొనసాగిస్తున్నారు.
అయితే ఎవరు ఊహించని విధంగా చిత్ర యూనిట్ లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. సడన్ గా ఇద్దరి టెక్నీషియన్స్ ని మార్చడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గత ఏడాది ఎండింగ్ లో త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ ఫినిష్ కాకముందే సినిమా చిత్ర యూనిట్ ని సెట్ చేసుకోని లాంచింగ్ కార్యక్రమాలను జరిపిన సంగతి తెలిసిందే. అతిధిగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు. అయితే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ యువ సంగీత దర్శకుడు తప్పుకున్నాడు.
ఆ కారణాలు ఎంటో తెలియదు గాని ఎన్టీఆర్ త్రివిక్రమ్ చర్చలు జరిపి థమన్ ని ఫిక్స్ చేశారు. థమన్ ఇటీవల మంచి సంగీతాన్ని అందిస్తు హిట్స్ కొట్టేస్తున్నాడు. ఇక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రహ్మణ్యం కూడా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఏఎస్.ప్రకాష్ ని సెట్ చేశారు. ఇక ఆ రెండు మార్పులు తెప్పితే ప్రాజెక్ట్ లో ఎలాంటి మార్పులు లేవు. ఫైనల్ గా మార్చ్ 26న ముహూర్తం సమయానికి సినిమా షూటింగ్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు.