మారుతున్న కాలం తో పాటు సినిమా పరిశ్రమలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పాటలను ఆడియో క్యాసెట్స్ ద్వారా విడుదల చేసే వారు. అన్ని పాటలను ఒకేసారి విడుదల చేయడం కోసం ఆడియో విడుదల వేడుక భారీ ఎత్తున నిర్వహించే వారు. క్యాసెట్లు పోయిన తర్వాత సీడీలను విడుదల చేయడం జరిగింది. సీడీల కాలం చాలా స్పీడ్ గా వెళ్లి పోయింది. ఇప్పుడు డిజిటల్ ఫార్మట్ లోనే పాటలు వస్తున్నాయి.
ఆడియో విడుదల కార్యక్రమాలు అనేవి ఇప్పుడు జరగడం లేదు. ఒక్కో పాట చొప్పున విడుదల చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ తో పాటు పలు ప్లాట్ ఫామ్స్ ద్వారా పాటలను విడుదల చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ లో ప్రస్తుతం లిరికల్ వీడియోలను విడుదల చేయడం ఒక ట్రెండ్ గా నడుస్తుంది. సినిమాకు సంబంధించిన ఫోటోలు మరియు చిన్న వీడియో బిట్స్ ను ఉపయోగిస్తూ ఆ ఫోటోలను యానిమేషన్ చేయడం ద్వారా వీడియోలను చేస్తూ ఉన్నారు.
ఇప్పడు తమన్ ఆ పద్దతిని మార్చేశాడు. లిరికల్ వీడియోలో హీరో మరియు సినిమా కంటే ఎక్కువ తానే కనిపిస్తున్నాడు. ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమా లోని కళావతి సాంగ్ లిరికల్ వీడియోలో మహేష్ బాబు కంటే ఎక్కువ థమన్ స్క్రీన్ స్పేస్ ను కలిగి ఉన్నాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇది లిరికల్ వీడియో నా లేదంటే ఒక కవర్ సాంగ్ లా చేశావా అంటూ కొందరు థమన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒకప్పుడు పాటలు విడుదల అయిన తర్వాత కవర్ సాంగ్స్ వచ్చేవి. కాని ఇప్పుడు మాత్రం లిరికల్ వీడియోలే కవర్ సాంగ్స్ మాదిరిగా వస్తున్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కళావతి పాట మొత్తం కూడా ఒక కవర్ సాంగ్ ను తలపించింది. సినిమాను ప్రమోట్ చేయడం కంటే తనను తాను ఎక్కువగా ఈ వీడియోలో థమన్ ప్రమోట్ చేసుకున్నట్లుగా అనిపించింది.. తనను చాలా అందంగా చూపించేందుకు ఈ వీడియోను చేశాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
థమన్ పద్దతిపై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా కాస్త అసంతృప్తి ఉన్నట్లుగా మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాని ప్రస్తుతం ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆయన్ను ఏం అనలేక పోతున్నాం అంటున్నారట. ఇటీవల గని సినిమా నుండి వచ్చిన రోమియో జూలియట్ పాటలో కూడా హడావుడి ఎక్కువ అయ్యింది అంటూ విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలకు ఇలాంటి హడావుడి ఉండదు కాని పెద్ద హీరోల సినిమాల సమయంలోనే థమన్ ఇలా చేస్తాడనే టాక్ వినిపిస్తుంది.
సినిమాల పాటలో థమన్ కొద్ది సమయం అలా కనిపిస్తే పర్వాలేదు కాని మొత్తం అంతా తానే ఉండటం అనేది పబ్లిసిటీ కోసం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళావతి పాట ఆహా అన్నట్లుగా ఉంది.. ముందు ముందు థమన్ పాటలు కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయి. కాని ఆయన స్క్రీన్ స్పేస్ ను లిరికల్ వీడియో లో తగ్గించుకుంటే కవర్ సాంగ్ అనే అనుమానాలు రావు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి థమన్ తన పద్దతిని కొనసాగించేనా లేదంటే తగ్గించేనా అనేది చూడాలి.